ETV Bharat / city

ED raids on Karvy office: కార్వీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు - కార్వీ ఎండీ పార్థసారథి

ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కార్వీ కార్యాలయాల్లో సోదాలు(ed raids on karvy office) నిర్వహించారు. మనీలాండరింగ్ కేసులో కార్వీ ఛైర్మన్ సహా పలువురు ఇప్పటికే అరెస్టు కాగా.. మరిన్ని వివరాల కోసం అధికారులు ఇవాళ కార్వీ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.

ed raids
ఈడీ సోదాలు
author img

By

Published : Sep 22, 2021, 5:26 PM IST

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ కార్వీ కార్యాలయాల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు సోదాలు చేస్తున్నారు(ED raids on Karvy office). మనీలాండరింగ్ కేసులో కార్వీ ఛైర్మన్ సహా పలువురు ఇప్పటికే అరెస్టు అయ్యారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు, ఆధారాల కోసం ఈడీ అధికారులు ఇవాళ కార్వీ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. కార్వీ కుంభకోణం కేసులో అరెస్టు అయిన వారిని కూడా ఈడీ విచారించింది.

మరోవైపు ఈ కేసులో ఆ సంస్థ మాజీ ఎండీ పార్థసారథిని బెంగుళూరు పోలీసుల కస్టడీకి హైకోర్టు నిలిపివేసింది. ముందుగా నాంపల్లి కోర్టు విచారణకు ఆదేశించింది. దీనిపై పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యం వల్ల విచారణకు హాజరుకాలేనని విన్నవించారు. పరిశీలించిన ధర్మాసనం.. పీటీ వారెంట్​ను రద్దు చేసింది. సెప్టెంబర్ 8న బెంగళూరులోని శేశాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో పార్థసారథిపై కేసు నమోదైంది. 109 కోట్ల రూపాయల మోసం కేసులో పార్థసారిథితో పాటు కార్వీ సీఈవో రాజీవ్ రంజన్, సీఎఫ్​వో కృష్ణహరిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే బెంగళూరు పోలీసులు విచారణ జరపాల్సి ఉంది.

పక్కా ప్రణాళికతో..

బ్యాంకుల నుంచి రూ.వందల కోట్లు రుణం తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ అక్రమాలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. ఈ అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకృష్ణ గురజాడను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీపీ హరికృష్ణ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని సొంతానికి వినియోగించుకునేందుకు ఆయన ఎనిమిదేళ్ల కిందట ప్రణాళికను సిద్ధం చేశాడు. సదరు సంస్థ ఛైర్మన్‌ పార్థసారథితో కలిసి రూ. 300 కోట్లు మళ్లించాడు. పార్థసారథి ఫోను, లాప్‌టాప్‌లోని వివరాల ఆధారంగా పోలీసులు పరిశోధించగా.. శ్రీకృష్ణ అక్రమ లావాదేవీలకు ఆధారాలు లభించాయి.

ఇదీ చూడండి:

DRUGS CASE : సుధాకర్‌ పాత్రపై డీఆర్‌ఐ అధికారుల ఆరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.