ETV Bharat / city

తెలంగాణ కరోనా ఆర్థిక ప్రభావం.. ఉద్యోగుల వేతనాల్లో కోత - latest news on Employers condemn the erosion of wages

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఖర్చులు, అవసరాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలన్నింటిలో కోత విధించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష అనంతరం.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతకి ఆమోదం తెలిపారు. కోతలు పోగా మిగిలిన వేతనాలను విడుదల చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

employers-condemn
తెలంగాణ కరోనా ఆర్థిక ప్రభావం.. ఉద్యోగుల వేతనాల్లో కోత
author img

By

Published : Mar 31, 2020, 7:25 AM IST

కరోనా నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాలు తగ్గించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించనున్నారు. ఐఏఎస్​, ఐపీఎస్​, ఐఎఫ్​ఎస్​ లాంటి అఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాల్లో 60 శాతం, మిగతా అన్నీ కేటగిరీల అధికారులు, ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత విధించనున్నారు.

నాలుగో తరగతి, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాల్లో 10శాతం.. అన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల ఫించన్లలో 50 శాతం మేర కోత విధించనున్నారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు కూడా కోత వర్తించనుంది.

ప్రస్తుతానికి మార్చి వేతనంలోనే!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రకటించిన వేతనాల కోతను ప్రస్తుతానికి మార్చి మాసానికే అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మున్ముందు పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలున్నట్లు సమాచారం. కోత విధించిన వేతనాన్ని భవిష్యత్తులో మళ్లీ ఉద్యోగుల ఖాతాలకు జమ చేస్తారా..? లేదా..అనే దానిపై స్పష్టత లేదు.

తెలంగాణలో మొత్తం 4,49,516 మంది ఉద్యోగులున్నారు. ఇందులో ప్రభుత్వ, ఒప్పంద ఉద్యోగులు 4,30,674 మంది. 2.5 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు జీతభత్యాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.3,500 కోట్ల మేరకు వెచ్చిస్తోంది. తాజా కోత వల్ల ప్రభుత్వానికి రూ.1,700 కోట్ల మేర ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. కరోనా నివారణ చర్యల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాము సహకరిస్తామని పీఆర్‌టీయూ టీఎస్‌ తెలిపింది.

నిర్ణయం పట్ల వ్యతిరేకత..

మరోవైపు ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులకు అశనిపాతమని.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు, ప్రభుత్వరంగ ఉద్యోగుల వేదిక ఖండించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ.. ఇంత తీవ్రమైన నిర్ణయం ఏ దేశంగానీ, రాష్ట్రంగానీ తీసుకోలేదని పేర్కొంది. వేతనంపై ఆధారపడి బతికే ఉద్యోగుల వేతనాల్లో ఏకపక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి అస్తవ్యస్థమవుతుందన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచించాలని కోరింది.

ఇదీ చూడండి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సమీక్ష... వేతనాల్లో కోత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.