కరోనా వల్ల అనేకమంది ఉద్యోగులు చనిపోతున్నారని.. అమరావతి ఉద్యోగుల ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సోకిన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్న బొప్పరాజు.. కరోనా రోగులకు ఆస్పత్రుల్లో ప్రత్యేక సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయంలోనే 8 మంది కరోనాతో మరణించారని బొప్పరాజు పేర్కొన్నారు. ఉద్యోగుల్లో భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ... కొవిడ్-19 రోగులను చేర్చుకోవడం ఆపేశాం..!