ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సహకార ఉద్యోగుల హెచ్ఆర్ విధానానికి సీఎం అధ్యక్షతన మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఆరువేల మంది ఉద్యోగ కుటుంబాలకు లబ్ధిచేకూరనుందని ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు తెలిపారు. ఇన్నాళ్లూ ఉద్యోగ భద్రత లేకుండా బతికిన సహకార ఉద్యోగులకు ఇకపై అన్ని సౌకర్యాలు లభించనున్నాయన్నారు. సహకార సంఘ ఉద్యోగులంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటారని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి.