ETV Bharat / city

భారీగా విద్యుత్తు వాడకం..గత ఏడాదితో పోలిస్తే 20% ఎక్కువ - ఏపీ విద్యుత్ వాడకం

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 20% శాతంగా ఉంది. సాధారణంగా అక్టోబర్​లో వినియోగం తగ్గాల్సి ఉండగా.. దీనికి భిన్నంగా ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ రోజుకు 197-200 మిలియన్ల యూనిట్ల మధ్య ఉంటుంది.

electricity usage in ap
electricity usage in ap
author img

By

Published : Oct 6, 2021, 7:01 AM IST

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ గత ఏడాది వినియోగంతో పోలిస్తే 20% పెరిగింది. సాధారణంగా అక్టోబరు నుంచి విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. దీనికి భిన్నంగా ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ రోజుకు 197-200 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) మధ్య ఉంటోంది. సెప్టెంబరు 17న అత్యధికంగా 212 మిలియన్‌ యూనిట్ల వినియోగం నమోదైంది. కొవిడ్‌ తర్వాత అన్ని రంగాలు క్రమేణా కోలుకుని కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరడంతోనే ఇలా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కొందామన్నా.. దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరగడంతో యూనిట్‌ ధరలు అసాధారణంగా పెరిగాయి. దీంతో పీక్‌ డిమాండ్‌ (సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు) సమయంలో సర్దుబాటు కోసం బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ రూ.18-20 మధ్య కొనుగోలు చేస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం నుంచి రోజూ 15-20 మిలియన్‌ యూనిట్ల మధ్య ఉత్పత్తి వస్తోంది. ఈనెల 14 నుంచి ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి వెళ్తుంది. ఉత్పత్తి ప్రారంభించాలంటే కేఆర్‌ఎంబీ నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇప్పటి మాదిరి రిజర్వాయర్‌లో నీటి మట్టం 860 మీటర్లు దాటితే సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం జెన్‌కోకు ఉండదు.

ఆర్థికాభివృద్ధికి విఘాతం

దేశంలో బొగ్గు కొరత తీవ్రమవుతూ కష్టనష్టాలను తీసుకొస్తోంది. విద్యుత్తు ఉత్పత్తికి కావలసిన ఇంధనంలో 70% వాటా బొగ్గుదే. కానీ... ప్రస్తుతం దేశంలోని అన్ని థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరాలో రోజుకు 60 వేల నుంచి 80 వేల టన్నుల వరకు లోటు కనిపిస్తోంది. బొగ్గు కొరత అయిదారు నెలలు కొనసాగే ప్రమాదం ఉన్నందున పలు థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి స్తంభించి కరెంటు కోతలు విధించాల్సి రావొచ్చు.

మూతపడిన ప్లాంట్లు

బొగ్గు కొరత కారణంగా కడపలోని రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటు(ఆర్‌టీపీపీ)లోని మూడు యూనిట్లలో ఉత్పత్తి నిలిపేశారు. కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న యూనిట్‌ కొన్ని నెలలుగా మూతపడింది. నిర్వహణ కోసం విజయవాడ వీటీపీఎస్‌లో ఒక యూనిట్‌ను ఆపేశారు. దీంతో జెన్‌కో నుంచి రోజుకు 80 ఎంయూల థర్మల్‌ విద్యుత్‌ లక్ష్యానికి 60 ఎంయూలకు మించి రావడం లేదు.

ఇదీ చదవండి: Aasara Scheme: రేపటి నుంచి రెండో విడత 'ఆసరా'..ప్రారంభించనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.