ETV Bharat / city

విద్యుత్​ స్పాట్​ బిల్లింగ్​ నిలిపివేత

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా స్పాట్​ బిల్లింగ్​ను నిలిపివేస్తున్నట్లు విద్యుత్​​ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక బిల్లు మొత్తం ఆన్​లైన్​లో చెల్లించాలని తెలిపాయి. వాస్తవ వినియోగంలో హెచ్చుతగ్గులను తర్వాతి నెలలో సర్దుబాటు చేయాలని నిర్ణయించాయి.

online payments of current bills in april month
విద్యుత్​ బిల్లులు ఆన్​లైన్​లో చెల్లించాలి
author img

By

Published : Mar 25, 2020, 5:24 AM IST

కరోనా నేపథ్యంలో స్పాట్​ బిల్లింగ్​ను నిలిపివేస్తూ విద్యుత్​ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత మూడు నెలల సగటు విద్యుత్తు వినియోగాన్ని మార్చి నెల విద్యుత్తు బిల్లుగా పరిగణించాలని విద్యుత్​ శాఖ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని వెబ్​సైట్​లో ఉంచుతుంది. ఆన్​లైన్​ ద్వారా బిల్లు మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారులకు సూచించింది. విద్యుత్​ వాస్తవ వినియోగం ప్రకారం బిల్లు మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటే తర్వాతి నెలలో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. మీటర్​ రీడింగ్​ ఆధారంగా విద్యుత్​ వినియోగ ఛార్జీలను సిబ్బంది ప్రతి నెలా ఇంటింటికీ వచ్చి అందిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా స్పాట్​ బిల్లింగ్​ నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు జేఎండీ చక్రధరబాబు తెలిపారు.

ఇదీ చదవండి:

'కోర్టుకు హామీ ఇచ్చి బకాయిలు ఎందుకు చెల్లించలేదు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.