రాజ్యసభ ఎన్నికలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4 స్థానాల ఎన్నికకు ఏర్పాట్లు చేయాలని.. సిబ్బందికి శాసనసభ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్.. 5 గంటలకు లెక్కింపు జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితం విడుదల కానుంది.
వైకాపా నుంచి మంత్రులు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామిక వేత్త అయోధ్య రామిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వాని... తెదేపా నుంచి వర్ల రామయ్య బరిలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వైకాపా ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటు ఎలా వేయాలన్న అంశంపై చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి శిక్షణ ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: