ETV Bharat / city

EK SHAM CHARMINAR KE NAAM: హైద్రాబాదీలకు గుడ్​న్యూస్​.. 'ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌' షురూ.. - చార్మినార్​ వద్ద ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్‌లు ఎన్నిఉన్నా.. చార్మినార్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు (EK SHAM CHARMINAR KE NAAM). పాతనగరం రూపురేఖలు చూడాలంటే ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఇలాంటి పర్యాటక ప్రాంతాలకు జనం వచ్చేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ట్యాంక్‌బండ్‌ వద్ద సండే ఫన్‌డే (Sunday fun day) నిర్వహిస్తోంది. ఇప్పుడు కొత్తగా చార్మినార్‌ వద్ద ‘ఏక్‌ షామ్‌ చార్మినార్ కే నామ్‌’ (EK SHAM CHARMINAR KE NAAM) పేరుతో కార్యక్రమం చేపట్టింది. ఇవాళ్టి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది.

EK SHAM CHARMINAR KE NAAM:
EK SHAM CHARMINAR KE NAAM:
author img

By

Published : Oct 17, 2021, 7:54 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగర వాసుల కోసం హైదరాబాద్​లో మరో వినోదకరమైన వేదిక సిద్ధమైంది (EK SHAM CHARMINAR KE NAAM). నగర ప్రజలకు ఆహ్లాదం, ఆనందాన్ని అందించేందుకు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన సండే ఫన్‌డే తరహాలో... చార్మినార్‌ వద్ద ఏర్పాట్లు చేస్తోంది. పాతబస్తీలోని చార్మినార్‌ పరిసరాల్లో 'ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌' పేరిట కార్యక్రమం చేపట్టింది. చార్మినార్ వద్ద నేటి నుంచి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 3గంటల నుంచి అర్ధరాత్రి వరకు... 'ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌' (EK SHAM CHARMINAR KE NAAM) కార్యక్రమం కొనసాగనుంది.

ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలు..
నగరవాసులను ఆకట్టుకునేలా.... సాయంత్రం ఆరున్నరకు పోలీస్‌ బ్యాండ్‌ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి ఎనిమిదన్నరకు దక్కనీ మజాహియ ముషాయిర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక అర్ధరాత్రి వరకు లాడ్‌ బజార్‌ను తెరిచి ఉంచనున్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా జీహెచ్​ఎంసీ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. భోజన ప్రియుల నోరూరించేలా... ఫుడ్‌ స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి (EK SHAM CHARMINAR KE NAAM).

ప్రతి ఆదివారం ట్రాఫిక్​ ఆంక్షలు..
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ సూచనలతో జీహెచ్​ఎంసీ, పోలీసులు, విద్యుత్‌శాఖల సమన్వయంతో.... అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌' (EK SHAM CHARMINAR KE NAAM) కార్యక్రమం దృష్ట్యా.... పాతబస్తీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి పది వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అఫ్జల్‌గంజ్‌, మదీన, గుల్జార్‌హౌజ్‌, కాలీకమాన్‌, ఫలక్‌నుమ, హిమత్‌పుర, పంచ్‌మోహల్లా, చార్మినార్‌, మొఘల్‌పుర, కోట్ల అలిజ, మూసాబౌలి, ముర్గిచౌక్‌, ఘాన్సీబజార్‌, లాడ్‌బజార్‌, మోతీగల్లీ, కిల్వత్‌ తదితర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించనున్నట్టు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రకటించారు.

వాహనాలు ఎక్కడ పార్కింగ్​ చెయ్యాలంటే..
సందర్శకుల వాహనాలు నిలిపేందుకు అధికారులు ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. చార్మినార్‌కు (EK SHAM CHARMINAR KE NAAM) వచ్చే ప్రజలు, సందర్శకులు తమ వాహనాలను నయాపూల్‌, మదీన ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. చార్మినార్ మార్గం గుండా ప్రయాణించే సాధారణ ప్రజలు... ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సీపీ అంజనీకుమార్‌ కోరారు. వాహనాలను పోలీసులు సూచించిన ప్రాంతంలో నిలిపివేసి రావాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: dussehra celebrations: అమలాపురంలో విజయదశమి ఉత్సవాలు... ఆకట్టుకున్న ప్రదర్శనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.