త్వరలో జరుగనున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరగాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యా సంబంధిత అంశాలపైన మంత్రి.. అధికారులతో సమీక్షించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించాలన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రంలో చేసిన మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, డీఈవోలు ఈ విషయం పై బాధ్యతగా వ్యవహరించేలా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాలు తెలిసేలా యాప్ను అందుబాటులో ఉంచాలన్నారు. ఇంగ్లీష్ మీడియం అమలు చేయటంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి : 'మలేసియాలో ఉద్యోగం అని తీసుకెళ్లారు... చిత్రహింసలకు గురి చేశారు'