ETV Bharat / city

'జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం క్విడ్ ప్రోకోలో భాగమే' - Enforcement Directorate latest news

జగన్ సంస్థల్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడులు... వైఎస్సార్ ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధికి ప్రతిఫలంగా ఇచ్చిన ముడుపులేనని ఈడీ స్పష్టం చేసింది. సంస్థ ఎండీగా ఎన్.శ్రీనివాసన్ బాధ్యత వహించాల్సిందేనని పేర్కొంది. పెట్టుబడులపై విచారించినప్పుడు శ్రీనివాసన్ దాటవేసే సమాధానాలతో తప్పించుకోవాలని ప్రయత్నించారని ఈడీ తెలిపింది. తనపై కేసును కొట్టివేయాలన్న శ్రీనివాసన్ అభ్యర్థనను తోసిపుచ్చాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఈడీ కౌంటరు దాఖలు చేసింది.

ED Oppose srinivasan's quash petition
'జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం క్విడ్ ప్రోకోలో భాగమే'
author img

By

Published : Feb 20, 2020, 10:59 PM IST

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో తనపై కేసు కొట్టేయాలన్న ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ అభ్యర్థనపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ హైకోర్టులో శ్రీనివాసన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్​పై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కౌంటర్ దాఖలు చేసింది. జగన్​కు చెందిన భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా సంస్థల్లో... ఇండియా సిమెంట్స్ పెట్టిన 140 కోట్ల రూపాయలు ముడుపులేనని కౌంటర్​లో పేర్కొంది.

వైఎస్సార్ ప్రభుత్వం ఇండియా సిమెంట్స్​కు కృష్ణా నదీ జలాలను కేటాయించిందని..., కడపలో రెండున్నరెకరాల భూమి లీజును పొడిగించిందని చెప్పిన ఈడీ... దానికి ప్రతిఫలంగా ముడుపులు ఇచ్చారని ఆరోపించింది. సుమారు 70 ఏళ్ల అనుభవం ఉన్న ఇండియా సిమెంట్స్... ఉత్పత్తి ప్రారంభం కాని సంస్థ... నష్టాల్లో ఉన్న కంపెనీల్లో అధిక ప్రీమియంతో వాటాలు కొనుగోలు చేసిందని తెలిపింది. తన కంపెనీలో పురోగతి లేకపోయినప్పటికీ అదే రంగంలోకి కొత్తగా వచ్చిన సంస్థలో అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టడం క్విడ్ ప్రోకోలో భాగమేనని పేర్కొంది.

పెట్టుబడులు కంపెనీ నిర్ణయాలని... వాటితో తనకు సంబంధం లేదని శ్రీనివాసన్ పేర్కొనడాన్ని ఈడీ వ్యతిరేకించింది. ఇండియా సిమెంట్స్ వైస్ ఛైర్మన్, ఎండీగా కంపెనీ కీలక నిర్ణయాలకు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. కంపెనీ నిర్ణయాలకు డైరెక్టర్లు బాధ్యత వహించాలని ఫెరాతో పాటు పలు చట్టాల్లో ఉందని తెలిపింది.

పెట్టుబడులపై తాము విచారణ జరిపినప్పుడు శ్రీనివాసన్ దాటవేసే సమాధానాలతో తప్పించుకునేందుకు ప్రయత్నించారని ఈడీ పేర్కొంది. శ్రీనివాసన్​పై సీబీఐ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసినప్పటికీ... సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందని వివరించింది. ఈడీ కోర్టులో విచారణ జరుగుతున్నందున ప్రస్తుత దశలో తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవద్దని కోరింది. శ్రీనివాసన్ క్వాష్ పిటిషన్​ను కొట్టివేయాలని ఈడీ కోరింది. ఏప్రిల్ 15న పిటిషన్​పై విచారణ జరగనుంది.

ఇదీ చదవండీ... అందుకే హడావుడిగా ఆస్తులు ప్రకటించారు: శ్రీకాంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.