ETV Bharat / city

సమన్వయ లోపం..అన్నదాతల సతమతం! - ఈ కర్షక్​తో రైతుల ఇబ్బందులు

ఈ-పంట, ఈ-క్రాప్‌, ఈ-కర్షక్‌.. పేర్లు, వెర్షన్‌లను నవీకరిస్తున్నా.. రైతుల సమస్యలు తీరడం లేదు. వ్యవసాయ, అనుబంధశాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరి వెబ్‌సైట్‌, యాప్‌ వారిదే కావడమూ కష్టాలకు కారణమవుతోంది. రైతులు పంటను యార్డులో ఉంచి.. వ్యవసాయశాఖ కార్యాలయాలు, మార్కెట్‌ యార్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

e-karshak
e-karshak
author img

By

Published : Jun 1, 2020, 6:55 AM IST

ఈ-పంట, ఈ-క్రాప్‌, ఈ-కర్షక్‌.. పేర్లు, వెర్షన్‌లను నవీకరిస్తున్నా.. రైతుల సమస్యలు తీరడం లేదు. వ్యవసాయ, అనుబంధశాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరి వెబ్‌సైట్‌, యాప్‌ వారిదే కావడమూ కష్టాలకు కారణమవుతోంది. సాగు భూములన్నీ రెవెన్యూ రికార్డుల్లో కన్పించకపోవడమూ కర్షకులకు ఇబ్బందులు తెస్తోంది. వేసిన పంట ఒకటైతే.. మరోటి రాయడం, కొన్ని భూముల్ని నమోదే చేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ-కర్షక్‌లో పేరు లేకుంటే ఉత్పత్తిని కొనుగోలు చేసేది లేదని ప్రభుత్వ కొనుగోలు సంస్థలు స్పష్టం చేస్తుండటంతో కర్షకులు కార్యాలయాలచుట్టూ తిరుగుతున్నారు.

ఈ-కర్షక్‌ నమోదు బాధ్యత వ్యవసాయశాఖ చూస్తుంటే.. పంట ఉత్పత్తుల కొనుగోలు మార్క్‌ఫెడ్‌, పౌరసరఫరాల సంస్థ, ఆయిల్‌ఫెడ్‌ మార్కెటింగ్‌ శాఖల ఆధ్వర్యంలో జరుగుతోంది. వీరి సాఫ్ట్‌వేర్ల మధ్య అనుసంధానం లేదు. వ్యవసాయశాఖ వద్ద నమోదైనట్లు కనిపిస్తుంది. అమ్ముకోవడానికి మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్‌ కేంద్రాలకు వెళ్తే అక్కడ పేరు లేదనే సమాధానం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ పత్తి కొనుగోలులో తలెత్తిన ఈ సమస్య.. ధాన్యం, శెనగలు, వేరుశెనగ సేకరణలోనూ పునరావృతమవుతోంది. రైతులు పంటను యార్డులో ఉంచి.. వ్యవసాయశాఖ కార్యాలయాలు, మార్కెట్‌ యార్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

గ్రామ సచివాలయంలోని వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుసంవర్ధక సహాయకుల ఆధ్వర్యంలో పంటల నమోదు జరుగుతోంది. కొందరు తమ శాఖకు చెందిన పంటలనే నమోదు చేసి మిగిలిన అంశాలను పట్టించుకోవడం లేదనే విమర్శలూ ఉన్నాయి.

రెవెన్యూ సమస్యలు పదిలం

కొందరి భూములు రెవెన్యూ ఆన్‌లైన్​లో నమోదు కాలేదు. పట్టాదారు పాసుపుస్తకాలూ తీసుకోలేదు. ఇలాంటి వారి వివరాలు సర్వే, సబ్‌డివిజన్ల నంబర్లు వెబ్‌ల్యాండ్‌లో ఉండవు. దీంతో కళ్లెదుటే పంట కన్పిస్తున్నా.. ఏ సర్వే నంబర్లో, ఎవరి పేరు మీద నమోదు చేయాలో తెలియడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. కౌలు రైతుల నమోదులోనూ సమస్యలు తప్పడం లేదు. ఈనాం భూములు సాగు చేసే వారి వివరాలూ రెవెన్యూ లెక్కల్లో కనిపించకపోవడంతో పంటలు అమ్ముకోలేకపోతున్నారు.

రైతు మొబైల్‌కే సందేశం పంపే ఏర్పాటు

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు ఈ-కర్షక్‌ ప్రామాణికం. సాగు చేసిన ప్రతి ఎకరం నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. ‘ఈ-కర్షక్‌ నిర్వహణ బాధ్యతనూ ఎన్‌ఐసీకి ఇచ్చాం. ఖరీఫ్‌ నుంచి ఏ సర్వే నంబర్లో ఏ పంట వేశారో రైతు మొబైల్‌కు సందేశం పంపించబోతున్నాం అని ఆయన తెలిపారు. తప్పుగా నమోదైనా, చేయకున్నా వెంటనే అప్రమత్తం కావచ్చని పేర్కొన్నారు. సాప్ట్‌వేర్ల మధ్య అనుసంధానం, రైతుల పేర్లు నమోదు కాకపోవడం వంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని మార్క్‌ఫెడ్‌ ఎండీ ప్రద్యుమ్న వివరించారు.

తప్పుల తడకగా నమోదు

పసుపు సాగుకు మించి నమోదైనట్లు గుర్తించారు. కొన్ని జిల్లాల్లో మూడు వేలమంది ఎక్కువగా ఉన్నట్లు తేలింది. పండ్లతోటలు వేసిన చోట శెనగ, ఇతర పంటలు వేసినట్లు నమోదు చేస్తున్న వైనం కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో మిరియాలు సాగు చేసినట్లు ఈ-కర్షక్‌లో ఉంది. వాస్తవానికి ఆ పంట ఎక్కడ వేశారో తెలియడం లేదు.

ప్రభుత్వం ఏం చేయాలి

  • ప్రతి సబ్‌ డివిజన్‌ ఆన్‌లైన్‌ చేయాలి. సచివాలయాల వారీగా దిద్దుబాటు చేపట్టాలి.
  • రైతుకు స్వయం నమోదు అవకాశమివ్వాలి. వాటిని పరిశీలించి ఆమోదించే బాధ్యత సిబ్బంది తీసుకోవాలి.
  • వ్యవసాయ, అనుబంధ శాఖలు, కొనుగోలు సంస్థలన్నీ ఒకే సాప్ట్‌వేర్‌తో ఏకీకృత వేదిక ఏర్పాటు చేసుకోవాలి.

ఇదీ చదవండి:

మిడతల గుంపును చెదరగొట్టలేకపోయిన 'టపాసులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.