ETV Bharat / city

dues Payment in installments వాయిదాల్లో బకాయిల చెల్లింపు

విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు వాయిదాల్లో బకాయిల చెల్లింపు చేపట్టనున్నాయి. పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థలకు నెలకు  రూ.600 కోట్ల చొప్పున చెల్లించనున్నట్లు తెలిపాయి. ఎల్‌పీఎస్‌ పథకం కింద డిస్కంలకు వెసులుబాటు ఉందని పేర్కొన్నాయి.

Payment of dues
డిస్కంలు
author img

By

Published : Aug 13, 2022, 10:14 AM IST

పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.7 వేల కోట్ల బకాయిలను డిస్కంలు 12 వాయిదాల్లో చెల్లించనున్నాయి. దీని ప్రకారం ప్రతి నెలా సుమారు రూ.600 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు భారీగా ఉన్న బకాయిలను ఒకేసారి చెల్లించడం డిస్కంలకు భారంగా మారుతున్న ఉద్దేశంతో వాయిదా పద్ధతిలో చెల్లించేలా వెసులుబాటు కల్పించడానికి లేట్‌ పేమెంట్‌ స్కీమ్‌ (ఎల్‌పీఎస్‌)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం బకాయి మొత్తాన్ని 12 వాయిదాల్లో తీసుకోవడానికి ఉత్పత్తి సంస్థలు కూడా అంగీకరించాయని కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ పద్మాజనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల నుంచే వాయిదా మొత్తాన్ని చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లోని ఉత్పత్తి సంస్థలకు ఉన్న బకాయిలను వాయిదాల్లో చెల్లించేలా డిస్కంలకు వెసులుబాటు కల్పించడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఎల్‌పీఎస్‌ పథకాన్ని రూపొందించింది.

ఏళ్ల తరబడి వివాదం: పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో డిస్కంలు కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం యూనిట్‌కు రూ.4.84 వంతున చెల్లించాలి. ఇది భారంగా ఉందని, యూనిట్‌ ధర తగ్గించాలని డిస్కంలు హైకోర్టులో పిటిషన్‌ వేేశాయి. తుది తీర్పు వచ్చే వరకు యూనిట్‌కు రూ.2.43 వంతున చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీని ప్రకారం 2018 జూన్‌ నుంచి పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకునే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.43 వంతున డిస్కంలు చెల్లిస్తున్నాయి. కేసు విచారణ ముగించిన కోర్టు పీపీఏ ప్రకారం పూర్తి మొత్తాన్ని నాలుగు వారాల్లోగా చెల్లించాలని గత మార్చి 15న తీర్పిచ్చింది. ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు రూ.4,800 కోట్లు, పీపీఏ నిబంధన ప్రకారం బకాయిలపై వడ్డీ రూపేణా రూ.2,200 కోట్లను డిస్కంలు చెల్లించాలి. తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిర్దేశిత వ్యవధిలో బకాయిలను చెల్లించడం సాధ్యం కాదని, ఏడాది వ్యవధి ఇవ్వాలంటూ డిస్కంలు అఫిడవిట్‌ దాఖలు చేశాయి. బకాయిల మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం భారమవుతోందని సుప్రీంకోర్టునూ ఆశ్రయించాయి.

తెరపైకి కొత్త సమస్య: విద్యుత్‌ బకాయిల చెల్లింపు వివాదం కొలిక్కి వచ్చిందని భావించిన డిస్కంలకు.. పునరుత్పాదక ఉత్పత్తి సంస్థలతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకునే విద్యుత్‌ లెక్కల్లో తేడాలున్నాయని, వాటిని పరిష్కరించుకోవడానికి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)లో పిటిషన్‌ దాఖలు చేయాలని పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. పవన విద్యుత్‌ ప్లాంటు పీఎల్‌ఎఫ్‌ (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) 23 శాతం, సౌర విద్యుత్‌ ఉత్పత్తి పీఎల్‌ఎఫ్‌ 18.5 శాతం వంతున పీపీఏ ప్రకారం డిస్కంలు నిర్దేశించాయి. కొన్ని సంస్థలు అంతకు మించి విద్యుత్‌ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానించాయి. ఇలా అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌కు బిల్లులు చెల్లించేది లేదని డిస్కంలు, చెల్లించాల్సిందేనని తయారీ సంస్థలు పట్టుబడుతున్నాయి. ఈ వివాదాన్ని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలిలో పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్పత్తి సంస్థలకు సూచనలు అందాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.