ETV Bharat / city

ప్రేమ వివాహంపై కులపెద్దల రాద్ధాంతానికి బలైపోయిన తల్లి, కుమారుడు - ఏపీ తాజా వార్తలు

Love marriage: ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వారు ఒకే కులానికి చెందిన వారైనా పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులకు ఎదిరించి విహహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా వేరే ఊరిలో నివాసం ఉంటున్నారు. ఈ సమయంలోనే కుల పెద్దలు వారి జీవితాల్లోకి ప్రవేశించారు. ఇక్కడే వారికి కుల పెద్దలు అసలైన ట్విస్ట్ ఇచ్చారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Love marriage
తల్లిదండ్రులకు ఎదిరించి విహహం
author img

By

Published : Sep 6, 2022, 7:13 PM IST

Love marriage: వాళ్లిద్దరికి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ. కలిసి జీవింతాంతం బతుకుదాం అనుకున్నారు. ఇద్దరికి ఒకే కులమైనా పెద్దలను ఒప్పుకోలేదని ఎదిరించి వివాహం చేసుకున్నారు. అనంతరం వేరే ఊరిలో నివాసం ఉంటున్నారు. ఇలా హాయిగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలోకి కుల పెద్దలు ప్రవేశించారు. మీరు గ్రామానికి వస్తే అందరి ముందు మరోసారి పెళ్లి జరిపిస్తామని అన్నారు. వారి మాటలు నమ్మిన దంపతులు ఇంటికి వచ్చారు. ఇక్కడే కుల పెద్దలు అసలైన ట్విస్ట్ ఇచ్చారు.

తెలంగాణలోని జనగామ జిల్లా పెద్దపహడ్ గ్రామానికి చెందిన దండు సాయికుమార్ (24), గోపిరాజుపల్లికి చెందిన భాగ్యలు ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం అయినా పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి మే13 2022న ఇరువురు వివాహం చేసుకున్నారు. అనంతరం భువనగిరిలో దంపతులు నివాసం ఉంటున్నారు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో తల్లిదండ్రులు, కుల పెద్దలు వివాహం చేస్తామని వీరిని గ్రామానికి పిలిపించారు.

వారి మాటలు నమ్మిన దంపతులు గ్రామానికి వచ్చారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కుల పెద్దలు భాగ్య పేరిట వ్యవసాయ భూమిని అబ్బాయి తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేయాలని తీర్మానించారు. ఇందుకు సాయికుమార్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. ఆ తర్వాత కుల పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేయాలని నిర్ణయించారు. కానీ భాగ్య తల్లిదండ్రులు ఆమెకు మరో వివాహం చేయాలని ప్రణాళిక వేశారు.

సాయికుమార్ ఇంటికి భాగ్యను పంపించేందుకు వారి తల్లిదండ్రులు నిరాకరించారు. నాలుగు నెలలుగా దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భాగ్య భర్త​కు ఫోన్​ చేసి తనకు మరో పెళ్లి చేయాలని చూస్తున్నారని చెప్పింది. చావైనా.. బ్రతుకైనా.. నీతోనే అంటూ అతనితో మొరపెట్టుకుంది. దీంతో సాయికుమార్ మూడు రోజుల క్రితం జనగామ పోలీసులను ఆశ్రయించారు. తన భార్యకు మరో పెళ్లి చెయ్యాలని కుల పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

పోలీసులు కులపెద్దలని పిలిచి విచారించారు. ఈ క్రమంలో కులపెద్దలు పెట్టిన పంచాయితీ చిచ్చు.. సాయికుమార్, అతని తల్లి అక్కమ్మలను తీవ్రంగా కలిచివేసేలా చేసింది. ఈ అవమాన భారాన్ని భరించలేక సాయికుమార్ తల్లి అక్కమ్మ తొలుత పురుగుల మందు తాగింది. ఆ తరువాత సాయికుమార్ కూడా పురుగుల మందు తాగాడు. వారిద్దరిని వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సాయికుమార్ మృతిచెందగా అతని తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కుల పెద్దలు ఘనంగా వివాహం చేస్తామని ఇంటికి పిలిపించి నాలుగు నెలలుగా తన భర్తను ఇబ్బందులకు గురిచేశారని భాగ్య ఆవేదన వ్యక్తం చేసింది , దీంతో పురుగుల మందు తాగి..చనిపోయాడని ఆమె వాపోయింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.