- శ్రీకాకుళం జిల్లా పలాసకు రేగులపాడు ఆఫ్‌షోర్, మహేంద్ర తనయ నది నుంచి 0.108 టీఎంసీలు, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి ఏలేరు కాల్వ నుంచి 0.30 టీఎంసీలు, తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు ఏలేరు జలాశయం నుంచి 0.09, ముమ్మడివరానికి పల్లంకుర్రు కాల్వ నుంచి 0.08 టీఎంసీలు కేటాయించారు.
- కృష్ణా జిల్లా తిరువూరుకు ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీ నుంచి 0.10 టీఎంసీలు, నందిగామకు గుడిమెట్ల నుంచి 0.14 టీఎంసీల కృష్ణా జలాలు, ఉయ్యూరుకు ఏకమూరు గ్రామంవద్ద నుంచి పుల్లేరు కాల్వ దారా 0.10 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతించారు.
- బుగ్గవాగు నుంచి గుంటూరు జిల్లా మాచర్లకు 0.23, పిడుగురాళ్లకు 0.28 టీఎంసీల చొప్పున, వెల్లటూరు సమీపంలో నాగార్జునసాగర్ కుడికాల్వ నుంచి 0.23 టీఎంసీలు, మంగళగిరికి 0.31 టీఎంసీలు, తాడేపల్లికి 0.27 టీఎంసీలను కృష్ణానది నుంచి కేటాయించారు.
- ప్రకాశం జిల్లాలో రామతీర్థం జలాశయం నుంచి చీమకుర్తికి 0.148 టీఎంసీలు, కనిగిరికి 0.135 టీఎంసీలు, గిద్దలూరుకు గుండ్లబ్రహ్మేశ్వరం నుంచి 0.17 టీఎంసీలు కేటాయించారు.
- నెల్లూరు జిల్లాలో కేపీ కెనాల్ నుంచి నాయుడుపేటకు 0.22 టీఎంసీలు, సూళ్లూరుపేటకు 0.25 టీఎంసీలు కేటాయించారు.
- అనంతపురం జిల్లాలో మడకశిరకు 0.081 టీఎంసీలను అక్కంపల్లి చెరువు నుంచి, కల్యాణదుర్గానికి పెన్నాహోబిళం జలాశయం నుంచి 0.15 టీఎంసీలు, పుట్టపర్తికి బుక్కపట్నం చెరువు నుంచి 0.71 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతిచ్చారు.
- కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరుకు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 0.38 టీఎంసీలు కేటాయించారు.
ఆవకా ఫార్మాకు 0.064 టీఎంసీలు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్తేశ్వరపురంలోని ఆవక ఫార్మా ప్రైవేటు లిమిటెడ్‌కు 0.064 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు.
ఇదీ చదవండి: