రాజధాని రైతులను ఇబ్బందిపెట్టే చర్యలను ప్రభుత్వం సత్వరమే నిలిపివేయాలని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. సమీకరణలో భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు, భూమిలేని పేదల పింఛన్లు విడుదల చేయాలని ట్విటర్లో డిమాండ్ చేశారు. కరోనా కాలంలోనూ సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారన్న పవన్... ఇలాంటి తరుణంలో వారిపై పాత కేసుల పేరుతో స్టేషన్లకు తీసుకెళ్లడం తగదని అన్నారు. లాక్డౌన్ విధించిన సమయంలోనే సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో ఆర్-5 జోన్ నిబంధనలు చేర్చి రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామనడం రాజధాని రైతులను మానసిక ఆందోళనకు గురిచేయడమే అవుతుందని పవన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం సరికాదని సూచించారు.
ఇదీ చదవండి