కరోనా నియంత్రణలో భాగంగా.. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రూ. 200.11 కోట్లు విరాళం చెక్కులు సీఎం జగన్‌కు అందించినట్లు మంత్రి తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖల నుంచి విరాళం ఇచ్చినట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. కృష్ణా జిల్లా మైనింగ్ ఫండ్ నుంచి రూ.187 కోట్లు, ఏపీఎండీసీ నుంచి రూ.10.62 కోట్లు, గనులు భూగర్భశాఖ నుంచి రూ.56 లక్షలు, ఉపాధిహామీ, వాటర్‌షెడ్‌శాఖ నుంచి రూ.1.50 కోట్లు, సెర్ప్ ఉద్యోగుల నుంచి రూ.50 లక్షలు విరాళాలు అందినట్లు మంత్రి రామచంద్రారెడ్డి వివరించారు. కరోనా నియంత్రణకు రాష్ట్రం అన్ని చర్యలు చేపడుతోందని... వైరస్ కట్టడికి గ్రామ సచివాలయాలు సమర్థంగా పనిచేస్తున్నాయన్నారు.
ఇవీ చూడండి: