ETV Bharat / city

కరోనా వారియర్స్.. వారి కళ్లల్లో మెరిసే ఆనందం ఎంతో తృప్తినిస్తుంది!

వైద్యుడంటే? ఓ సలహాదారు... మార్గదర్శి... శ్రేయోభిలాషి, ప్రాణ రక్షణకుడు. మొత్తంగా దైవ సమానుడు! ఒక ప్రాణాన్ని నిలబెట్టినప్పుడో, ప్రమాదకరమైన సమస్యను గుర్తించి చికిత్స చేసినప్పుడో డాక్టర్లకు కలిగే తృప్తే వేరు. కరోనా విజృంభణతో వైద్యుల గొప్పతనం అందరికీ తెలిసింది. డాక్టర్స్‌ డే సందర్భంగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సుపరింటెండెంట్ డా.రాజారావు అనుభవాలు తెలుసుకుందాం.

doctor-day-special-story-on-gandhi-hospital-superintendent-raja-rao
డాక్టర్ రాజారావు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్
author img

By

Published : Jul 1, 2020, 11:48 AM IST

కరోనా విజృంభణ తర్వాత వైద్య వృత్తి గొప్పతనం మరింత బాగా అర్థమైంది. అన్నింటికీ మించి ధైర్యం, నిస్వార్థ గుణం ప్రాముఖ్యత అవగతమైంది. కరోనా పేరు వింటేనే అంతా బెంబేలెత్తుతున్న సమయంలో, కరోనా సోకినవారిని తాకటానికే జంకుతున్న తరుణంలో కొవిడ్‌ చికిత్స కేంద్రం బాధ్యతలు నిర్వహించటం నిజంగా భాగ్యమే.

ఒకవైపు నిరంతర పర్యవేక్షణ, బాధ్యతల ఒత్తిడి.. మరోవైపు అనుకోనిదేదైనా జరిగితే వెల్లువెత్తే విమర్శల మాటెలా ఉన్నా జబ్బు నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిపోతున్నవారి కళ్లలో మెరిసే ఆనందం ఎంతో తృప్తిని కలిగిస్తుంది. కృతజ్ఞతా భావం మానసిక బలాన్ని చేకూరుస్తుంది. ఇంట్లో వాళ్లతో సన్నిహితంగా ఉండలేకపోతున్నామనే బాధను కొంతవరకిది మరిపింపజేస్తుంది.

అమ్మను ఒక్కసారే చూశా

ప్రస్తుతం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినప్పుడు భార్యను, పిల్లలను చూడగానే దుఃఖం పొంగుకొచ్చినంత పనవుతుంది. డాక్టర్లు కూడా మనుషులే. అందరిలాగా మాకూ కరోనా సోకొచ్చు. ఇతరుల కన్నా ముప్పు మరింత ఎక్కువ కూడా. నేను రోజులో ఎక్కువభాగం కరోనా బాధితులతోనే గడుపుతుంటా. రోజుకు 3 సార్లు అత్యవసర విభాగానికి వెళ్తాను. కనీసం ఐదారు వందల మంది పాజిటివ్‌ రోగులను ముట్టుకుంటా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్‌ సోకొచ్చు కదా. అందుకే ఇంట్లో ఎవరిని తాకాలన్నా భయమే.

ఒకే ఇంట్లో ఉంటున్నా గత 4 నెలలుగా భార్యను, పిల్లలను దూరంగా చూడటమే. దూరం నుంచి మాట్లాడుకోవటమే. ఇంతకుముందు నెలకు ఒకసారైనా అమ్మను చూడటానికి ఊరుకు వెళ్లేవాడిని. కరోనా మొదలయ్యాక ఒక్కసారే వెళ్లాను. అదీ దూరం నుంచే చూసి వచ్చాను. ఇది నా ఒక్కడి పరిస్థితే కాదు. కరోనా చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు, వార్డ్‌ బాయ్‌లు, పారిశుద్ధ్య సిబ్బంది అందరిదీ ఇలాంటి స్థితే. ఎంతోమంది నిస్వార్థంగా, ధైర్యంగా సేవ చేస్తున్నారు.

ఆ విషయంలో మాత్రం బాధ కలిగింది

కరోనా నిజమైన మనిషిని, మానవత్వ విలువలను బయట పెట్టింది. నిజమైన సేవకులెవరో ప్రపంచానికి చూపించింది. ఇంత తృప్తిలోనూ కలవరపరచే విషయం వైరస్ భయంతో కొందరు మానవత్వాన్ని మరచిపోవటం. జబ్బు నుంచి కోలుకున్నా కూడా పిల్లలకు సోకుతుందనో, మరో కారణంతోనో తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను ఇంటికి తీసుకుపోవటానికి వెనకాడుతుండటం విచారకరం. బాగయ్యాక ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎవరికీ ఏమీ కాదని చెప్పినా వినిపించుకోవటం లేదు.

కొందరు కడసారి చూడటానికైనా రావటం లేదు. మీరే ఏమైనా చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదని తెగేసి చెబుతున్నారు. గత నాలుగు నెలల్లో ఇలాంటి 50-60 సందర్భాలు చూశాను. వీరిని చూస్తుంటే మనుషులేనా? అనిపిస్తుంటుంది. ఎలాంటి సంబంధం లేని మేం ప్రాణాలకు తెగించి చికిత్స చేస్తుంటే.. పేగు బంధం గలవారు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి? అని బాధ కలుగుతుంది.

తెలుసుకోవాల్సింది: కరోనాకు భయపడొద్దు. ఇప్పటికే ఎంతోమంది కోలుకున్నారు. జబ్బు నుంచి కోలుకున్నాక ఎవరికీ ఏమీ కాదు. కరోనా ఇప్పుడప్పుడే పోయేదీ కాదు. ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవటం, మాస్కు ధరించటం వంటి జాగ్రత్తలు పాటిస్తే జబ్బే దరిజేరదు.

ఇవీ చదవండి...

253.6 ఎకరాల అమర రాజా భూములు వెనక్కి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.