ETV Bharat / city

Doctor Attacked on phc Senior Assistant: ఫిర్యాదు చేసినందుకు పీహెచ్​సీ డాక్టర్​ నిర్వాకం.. ఇంటికెళ్లి మరీ ఉద్యోగిపై దాడి - doctor attacked on phc employee

Doctor Attacked on phc Senior Assistant: కంటివెలుగు నిధులను అక్రమంగా వాడుకున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు ఓ డాక్టర్​. ఆ ఉద్యోగి ఇంటికి వెళ్లి మరీ దురుసుగా ప్రవర్తించారు. ఎందుకిలా చేస్తున్నారని కుటుంబీకులు అడిగినా సమాధానం చెప్పకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆ దృశ్యాలను బాధితుడి కుటుంబీకులు సెల్​ఫోన్​లో చిత్రీకరించారు.

ఉద్యోగిపై దాడి చేస్తున్న డాక్టర్
ఉద్యోగిపై దాడి చేస్తున్న డాక్టర్
author img

By

Published : Jan 23, 2022, 1:57 PM IST

Updated : Jan 23, 2022, 4:21 PM IST

Doctor Attacked on phc Senior Assistant: లబ్ధిదారులకు అందాల్సిన కంటివెలుగు నిధులను అక్రమంగా వినియోగించుకున్నారని ఫిర్యాదు చేసినందుకు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు ఓ పీహెచ్​సీ డాక్టర్​. తనతో పాటు మరో ఇద్దరినీ వెంటపెట్టుకుని ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం పీహెచ్​సీలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్​ రాజశేఖర్.. గతంలో టేకులపల్లి మండలం సులానగర్​ పీహెచ్​సీలో పనిచేశారు. ఆ సమయంలో తనతో పాటు సీనియర్​ అసిస్టెంట్​గా సత్యప్రసాద్ ఉన్నారు. కంటివెలుగు పథకానికి సంబంధించిన రూ. 2.50 లక్షలను రాజశేఖర్​ సొంత ఖర్చులకు వాడుకున్నట్లు సత్యప్రసాద్​ గుర్తించారు. వెంటనే ఆ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు.. రాజశేఖర్​​ను 2 నెలల పాటు విధుల నుంచి తొలగించారు.

ఆలస్యంగా వెలుగులోకి

సస్పెన్షన్​ ముగిసిన అనంతరం జగన్నాథపురం పీహెచ్​సీకి రాజశేఖర్​ బదిలీ అయ్యారు. సత్యప్రసాద్​ జగిత్యాలలో పనిచేస్తున్నారు. తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు సత్యప్రసాద్​పై కక్ష పెంచుకున్న రాజశేఖర్​.. ఆయనపై దాడి చేయాలని నిశ్చయించుకుని సమయం కోసం ఎదురుచూశారు. ఇటీవల సత్యప్రసాద్​.. పాల్వంచకు వచ్చినట్లు తెలుసుకున్న డాక్టర్​.. తనతో పాటు మరో ఇద్దరిని తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. ఎందుకిలా దాడి చేస్తున్నారని కుటుంబీకులు ప్రశ్నించినా సమాధానమివ్వలేదు. ఆ సన్నివేశాలను వీడియో తీస్తుంటే ఇక చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. జనవరి 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై సత్యప్రసాద్​ పాల్వంచ పట్టణ పోలీస్​ స్టేషన్​, కొత్తగూడెం డీఎంహెచ్​ఓకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: VIZAG STEEL PLANT : ఉద్యమానికి ఏడాది పూర్తి...ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్​కు పిలుపు

Last Updated : Jan 23, 2022, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.