ETV Bharat / city

బర్డ్‌ఫ్లూపై వదంతులు నమ్మొద్దు: మంత్రి అప్పలరాజు

బర్డ్‌ఫ్లూపై ఎలాంటి వదంతుల్ని నమ్మవద్దని పశు సంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. మన దేశంలో మనుషుల్లో ఎక్కడా బర్డ్‌ఫ్లూ సోకిన దాఖలాల్లేవు’  అని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. బాగా ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తినొచ్చని తెలిపారు.

Do not believe the rumors about bird flu
బర్డ్‌ఫ్లూపై వదంతులు నమ్మొద్దు: మంత్రి అప్పలరాజు
author img

By

Published : Jan 18, 2021, 8:35 AM IST

బర్డ్‌ఫ్లూపై ఎలాంటి వదంతుల్ని నమ్మవద్దని పశు సంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. ‘ఈ వ్యాధి పక్షి నుంచి పక్షికి సోకుతుందిగానీ పక్షి నుంచి మనిషికి సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మన దేశంలో మనుషుల్లో ఎక్కడా బర్డ్‌ఫ్లూ సోకిన దాఖలాల్లేవు’ అని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు.

‘బర్డ్‌ ఫ్లూ వస్తుందనే అనుమానంతో ప్రజలు తినకపోవడంతో కోడిగుడ్లు, మాంసం ధరలు పడిపోతున్నాయి. బాగా ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తినడంవల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సోకదు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించింది’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

తిరుమల కాలిబాటలో దొంగలు.. ఆందోళనలో భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.