ETV Bharat / city

appsc: ఏపీపీఎస్సీ నిర్వాకం... గ్రూపు-2 ఉద్యోగులకు స్థానభ్రంశం

రాష్ట్రంలో గ్రూపు-2 (1999) అభ్యర్థుల భర్తీ ప్రక్రియ సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కొత్త మలుపు తిరిగింది. ఏపీపీఏస్సీ 2018 మే 10న ప్రకటించిన అభ్యర్థుల ఎంపిక జాబితాను అనుసరించి చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈనెల 4న మెమో జారీ చేసింది. ప్రస్తుత ఉత్తర్వులతో 200 మంది ఉద్యోగ స్థానాలు మారతాయి. నేడు ఏపీపీఎస్సీ సమావేశం జరగనుంది. ఇందులో 1999 నాటి గ్రూపు-2 నోటిఫికేషన్‌ వ్యవహారం, కొత్తగా ఇవ్వనున్న నోటిఫికేషన్లు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.

appsc
ఏపీపీఎస్సీ
author img

By

Published : Aug 11, 2021, 7:23 AM IST

రెండు దశాబ్దాలకుపైగా న్యాయ వివాదాల్లో నలుగుతున్న గ్రూపు-2 (1999) అభ్యర్థుల భర్తీ ప్రక్రియ సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కొత్త మలుపు తిరిగింది. ఈ తీర్పునకు అనుగుణంగా... ఏపీపీఏస్సీ 2018 మే 10న ప్రకటించిన అభ్యర్థుల ఎంపిక జాబితాను అనుసరించి చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈనెల 4న మెమో జారీ చేసింది. అయితే... ఏపీపీఎస్సీ జాబితాలో స్థానిక, స్థానికేతరుల కోటా ఎంపికలో తప్పులు దొర్లాయని, దీన్నే ప్రామాణికంగా తీసుకుంటే తాము నష్టపోతామని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుత ఉత్తర్వులతో 200 మంది ఉద్యోగ స్థానాలు మారతాయి. ఇప్పటికే వాణిజ్య పన్నులశాఖలో ఏసీటీఓగా పని చేస్తున్న అభ్యర్థి ఎక్సైజ్‌శాఖలో ఎస్‌ఐ, రెవెన్యూశాఖలో డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులకు మారాల్సి వస్తుంది. 16 ఏళ్ల నుంచి పని చేస్తున్న అభ్యర్థుల్లో సుమారు 75 మంది భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారైంది. పలువురు ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి మారాల్సిన వస్తుంది.

ఒక నోటిఫికేషన్‌... మూడు విడతల నియామకాలు

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 10 ప్రభుత్వ శాఖల్లో ఎగ్జిక్యూటివ్‌ (104 పోస్టులు), ఏడు శాఖల్లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ (141) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 1999 డిసెంబరు 28న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ జారీచేసింది. దీని ద్వారా 2000 ఆగస్టు 31 నాటికి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామంది. 2000 డిసెంబరులో 104 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న 141 పోస్టులను ఉపసంహరించుకోవడాన్ని అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ తప్పుబట్టింది. దీంతో 141 ఏఎస్‌వో పోస్టులను 2002లో ఏపీపీఎస్సీ రెండో విడత భర్తీచేసింది. మిగిలిన శాఖల్లో ఖాళీగా ఉన్న వందలాది పోస్టుల కోసం నిరుద్యోగులు ట్రైబ్యునల్‌, హైకోర్టులను ఆశ్రయించారు. ఫలితంగా మూడో విడతలో 2005లో అదనంగా 973 ఎగ్జిక్యూటివ్‌, 199 నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు భర్తీచేసింది. మొదటి విడత 104 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్ల ప్రకారం 1975 నవంబరు 15నాటి 763 జీవోను అమలుచేసింది. అయితే... 2005లో అదనంగా వచ్చిన పోస్టుల భర్తీ విషయంలో మాత్రం ట్రైబ్యునల్‌, హైకోర్టుల తీర్పుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2002 మార్చి 7న ఇచ్చిన 124 జీవోను అమలుచేసింది. మొదటి రెండు విడతల్లో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులను మినహాయించి 2005లో అదనంగా వచ్చిన పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు నాటి తీర్పులో పేర్కొంది. సచివాలయంలో ఏఎస్‌వోలను ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్లోకి ఎంపిక చేయకపోవడాన్ని నిరసిస్తూ వారు 2005లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన సుప్రీంకోర్టు 2015, 2018, 2021 సంవత్సరాల్లో తీర్పులు వెలువరించింది. తన తీర్పుల్లో స్పష్టతనిస్తూ సుప్రీంకోర్టు గతనెలలో మరో తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వం ఇటీవల జారీచేసిన మెమోలో ఏపీపీఎస్సీ 2018 మే 10న ప్రకటించిన అభ్యర్థుల జాబితాకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలంది.

2018 జాబితాతోనే సమస్య!

ప్రభుత్వ మెమోలో పేర్కొన్న 2018లో ప్రకటించిన అభ్యర్థుల ఎంపిక జాబితాలో తప్పులు దొర్లినట్లు ఏపీపీఎస్సీ దృష్టికి పలువురు ఉద్యోగులు తీసుకువెళ్లారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 1975 నవంబరు 15న ఇచ్చిన జీవో763 మేరకు స్థానిక, స్థానికేతరుల అభ్యర్థుల రిజర్వేషన్లు పాటిస్తూ అభ్యర్థులను ఎంపికచేయాలి. ప్రతి జోన్‌లోనూ 70% పోస్టులను స్థానికులతో, మిగిలిన 30% పోస్టులను మెరిట్‌ ఆధారంగా స్థానికులు, స్థానికేతరులతో భర్తీ చేయాలి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు రిజర్వు చేసిన పోస్టుల్లోనూ స్థానికులకు 70% పోస్టులు భర్తీచేయాలి. ఏపీపీఎస్సీ ఇందుకు భిన్నంగా అభ్యర్థులను ఎంపికచేసింది. జోన్‌-3లో (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు) 42 అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌(ఏసీటీవో) పోస్టులు ఉన్నాయి. స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్లు అమలు చేస్తూ 70% పోస్టులను భర్తీ చేయాలి. బీసీ-బీ జనరల్‌కు కేటాయించిన నాలుగు పోస్టులలో మూడింటిని లోకల్‌ అభ్యర్థులతో నింపాలి. ఇందుకు భిన్నంగా నాలుగు పోస్టులకు నాన్‌లోకల్‌ అభ్యర్థును ఎంపికచేశారు. బీసీ-డీ జనరల్‌కు కేటాయించిన మూడు పోస్టులకు రెండింటిని లోకల్‌ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా ఒక్కరికే అవకాశమిచ్చారు. ఓసీ-జనరల్‌కు కేటాయించిన 14 పోస్టుల్లోని పదింటిని లోకల్‌ అభ్యర్థులతో భర్టీ చేయాల్సి ఉండగా తొమ్మిది మందినే ఎంపిక చేశారు’’ అని వివరించారు. ఇటువంటి సమస్యలే ఇతర శాఖల్లో, జోన్లలో జరిగినట్లు చెబుతున్నారు. వీటిని సరిదిద్ది కుల, స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తూ కొత్త జాబితాను విడుదల చేయాలని విన్నవిస్తున్నారు. ఈ జాబితాలో కొందరు చనిపోయిన వారి పేర్లు, 2005లో ఉద్యోగంలో చేరి మానేసిన వారి పేర్లు, ఉద్యోగంలో చేరనివారి పేర్లు ఉన్నాయి. శాఖలు మారే అభ్యర్థులకు శిక్షణ, డిపార్టుమెంటల్‌ పరీక్షల ఉత్తీర్ణత, ప్రొబేషన్‌ల నుంచి మినహాయింపు ఇస్తూ నోషనల్‌ సీనియారిటీ, నోషనల్‌ ప్రమోషన్‌లు ఇచ్చినప్పుడే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది.

నేడు కమిషన్‌ భేటీ!

ఏపీపీఎస్సీ సమావేశం బుధవారం జరగనుంది. ఇందులో 1999 నాటి గ్రూపు-2 నోటిఫికేషన్‌ వ్యవహారం, కొత్తగా ఇవ్వనున్న నోటిఫికేషన్లు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.

ఇదీ చదవండి

NAREGA: చెల్లింపుల వివరాలతో అఫిడవిట్​ దాఖలు చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.