అమరావతి రాజధాని రెఫరెండంగా వెళ్దామన్న చంద్రబాబు సవాల్‌ను స్వీకరించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా..? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్న ఆయన పైశాచిక ఆనందం కోసం రాష్ట్ర మంత్రులు అత్యంత హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కొడాలి నాని మంత్రి పదవి పొడిగింపునకు పాకులాడుతున్నారని ఉమ విమర్శించారు. తెదేపా హయాంలో కట్టిన రాజధాని భవనాల్లో ఉంటూ 18 నెలలుగా సీఎం జగన్, మంత్రులు న్యాట్యమాడుతున్నారని దుయ్యబట్టారు. 1.30 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం సాధించారని నిలదీశారు. లక్షల కోట్ల సంపద నాశనం చేసి... విశాఖలో దోచుకున్న భూములను అమ్ముకునేందేకే మూడు రాజధానుల ఆట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోరు అదుపులో ఉంచుకోవాలి
మంత్రి కొడాలి నాని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించలేదనే విషయాన్ని నిరూపించాలని డిమాండ్ చేశారు. మంత్రి నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి