కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటిస్తే సీఎం జగన్ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పారాసిటమల్ వేసుకుంటే తగ్గిపోతుందని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని...ఆయన డాక్టర్ ఎప్పుడయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం పీఠంపై కూర్చొని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి : ఐదు వేల కోట్ల నిధులు ఎవరిస్తారు?: స్పీకర్ తమ్మినేని