దిల్లీలో తెలుగు వారి చూపు... భాజపా వైపు: పురంధేశ్వరీ - దిల్లీ ఎన్నికలు
దిల్లీ వాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేజ్రీవాల్ విఫలమయ్యారని ఏపీ భాజపా నేత పురంధేశ్వరీ అన్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి తెలుగు మహిళలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆమె... దేశ రాజధానిలో భాజపా సర్కారుతోనే పూర్తి స్థాయి అభివృద్ధి సాధ్యమని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు భాజపా గెలుపునకు బాటలు వేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అలాగే దిల్లీలోని తెలుగు మహిళలు భాజపా వైపు ఆసక్తి కనబరుస్తున్నారని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాజపా నేత, నటి కవిత సహ పలువురు పాల్గొన్నారు.
purandeswari
ఇదీ చదవండి: