ETV Bharat / city

Live Video: సమస్యలపై ప్రశ్నించినందుకు సర్పంచ్​ దాష్టికం.. వీడియో వైరల్​ - Sarpanch attack Live Video

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని దామస్తాపూర్ గ్రామ సర్పంచ్... ఊళ్లో నెలకొన్న సమస్యల గురించి అడిగినందుకు ఓ స్థానికుడిపై దాడి చేశాడు. బూతులు తిడుడూ.. కిందపడేసి తన్నుతూ.. ముష్టిగుద్దులతో విరుచుకుపడ్డాడు.

damastapur-sarpanch-attack-on-villager
Live Video: సమస్యలపై ప్రశ్నించినందుకు స్థానికునిపై సర్పంచ్​ దాష్టికం.. వీడియో వైరల్​
author img

By

Published : Sep 22, 2021, 1:32 PM IST

సమస్యలపై ప్రశ్నించినందుకు స్థానికునిపై సర్పంచ్​ దాష్టికం.. వీడియో వైరల్​

గ్రామంలోని సమస్యలపైన ప్రశ్నించిన స్థానికునిపై ఆ ఊరి సర్పంచ్​ చేతివాతం చూపించాడు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని దామస్తాపూర్ గ్రామం ఈ ఘటన చోటు చేసుకుంది. దామస్తాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన ఓ గొడవ గురించి పెట్టిన పంచాయితీకి సర్పంచ్ జైపాల్ రెడ్డి హాజరయ్యాడు. అదే క్రమంలో.. ఊరిలో ఉన్న నీటి సమస్య ప్రస్తావన వచ్చింది. అదే సమయంలో గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ అనే స్థానికుడు.. పంచాయతీ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయని ప్రస్తావించాడు. రెండు నెలలుగా నీళ్లు రాక ఇబ్బందులు పడుతుంటే.. ఏం చేస్తున్నారని.. ప్రశ్నించాడు. నీటి సమస్య, డ్రైనేజీ సమస్య మీద వెంటనే దృష్టి పెట్టాలని సర్పంచ్​కు సూచించాడు.

కోపంతో ఊగిపోతూ...

అందరి ముందు నిలదీయటంతో కోపోద్రిక్తుడైన సర్పంచ్​ జైపాల్​రెడ్డి.. బూతుల దండకంతో వీరంగం సృష్టించాడు. దుర్భాషలాడుతూ.. కొట్టటం మొదలుపెట్టాడు. కిందపడేసి.. తన్నుతూ.. ముష్టిగుద్దులతో విరుచుకుపడ్డాడు. వెంటనే అక్కడున్న స్థానికులు.. సర్పంచ్​ను నివారించి పక్కకు తీసుకెళ్లారు. సర్పంచ్​ దాడితో కంగుతిన్న పిట్టల శ్రీనివాస్... గ్రామ సమస్యలను ప్రస్తావిస్తే... ఇలా దాడి చేస్తారా అని ఆందోళన వ్యక్తం చేశాడు. అనంతరం పోలీస్​స్టేషన్​లో సర్పంచ్​ జైపాల్​రెడ్డిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనివాస్​పై సర్పంచ్​ దాడి చేస్తుండగా... ఆ దృశ్యాలను స్థానికులు చరవాణుల్లో బంధించారు. వాటిని సోషల్​మీడియాలో పెట్టగా.. ఇప్పుడు అవి వైరల్​గా మారాయి.

ఇదీ చూడండి: school committe: పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఘర్షణలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.