Dalmia Cement MD withdraws quash petition: జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. సోమవారం జరిగిన విచారణలో జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించాలంటూ.. 2016లో పునీత్ దాల్మియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సీబీఐ కోర్టులో విచారణ నిలిపివేస్తూ 2016లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయిదేళ్లుగా పిటిషనర్ అభ్యర్థన మేరకు స్టే ఉత్తర్వులు పొడిగిస్తున్నారు. ఇటీవల జగన్ కేసులకు సంబంధించిన పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతుండటంతో దాల్మియా పిటిషన్పై వాదనలు ప్రారంభమయ్యాయి. దాల్మియా తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పీవీ కపూర్ వాదనలు వినిపించారు. సోమవారం వాదనలు కొనసాగాల్సి ఉండగా క్వాష్ పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని దాల్మియా తరఫు న్యాయవాది కోరారు. అంగీకరించిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. పిటిషన్ ఉపసంహరణకు అంగీకరించారు.
సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై విచారణ జరపాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ. విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈనెల 21వ తేదీకి వాయిదా పడింది. సుప్రీంకోర్టు న్యాయవాది రావల్సి ఉన్నందున.. సమయం ఇవ్వాలని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది. నేటినుంచి ఇండియా సిమెంట్స్ క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది.
ఇదీ చదవండి.. ys viveka murder case: 'రెండు వ్యాజ్యల్లో కౌంటర్ దాఖలు చేయాలి'