ETV Bharat / city

సింగపూర్​లోని తెలుగువారి సేవలు ప్రశంసనీయం: పురందేశ్వరి - corona virus news

కొవిడ్ సమయంలో ఎంతో మందిని ఆదుకునేందుకు సింగపూర్​లోని తెలుగువారు చేపడుతున్న కార్యక్రమాలను భాజపా నాయకురాలు పురందేశ్వరి ప్రశంసించారు. వివిధ సంఘాల సహకారంతో పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి రప్పించటంలో చేసిన కృషి అభినందనీయమన్నారు.

daggubati-purandeswari
daggubati-purandeswari
author img

By

Published : Jun 17, 2020, 7:43 PM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రధాని నరేంద్రమోదీ అన్ని విధాలా విజయవంతం అవుతున్నారని ఆ పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. సింగపూర్​లోని తెలుగువారితో వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. పీపీఈ కిట్ల కొరతను అధిగమించి... ఇవాళ ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితికి చేరుకుందని చెప్పారు. హెచ్​సీక్యూ మందును సుమారు 55 దేశాలకు పైగా ఎగుమతి చేస్తున్నామని గుర్తు చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

దగ్గుబాటి పురందేశ్వరి

'మార్చి 20 నుంచి విదేశాంగ వ్యవహారాల శాఖ కొవిడ్ సెంటర్​ను ఏర్పాటు చేసింది. 24 గంటల పాటు సేవలందిస్తూ...విదేశాల్లో చిక్కుకున్న ఎంతోమంది స్వదేశాలను రప్పించే ఏర్పాట్లు చేసింది. వందే భారత్ మిషన్​లో భాగంగా ఎంతో మంది విద్యార్థులను స్వదేశానికి రప్పించాం. విదేశాల్లో ఉన్న ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. భారతీయుల క్షేమం కోసం సింగపూర్ వేదికగా కార్యక్రమాలు చేపడుతున్న తెలుగువారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.'-పురందేశ్వరి దగ్గుబాటి, భాజపా నాయకురాలు

సింగపూర్​లోని తెలుగువారితో పురందేశ్వరి మాటామంతీ

ఇదీ చదవండి: 'ఎంతో మంది సీఎంలను చూశారు.. జగన్​ ఎంత?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.