Cyclone To Be Formed:ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, వాయుగుండంగా బలపడింది. రేపటిలోగా తుపానుగా మారుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండం వాయువ్యంగా కదులుతూ పశ్చిమధ్య బంగాళాతం నుంచి ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అనంతరం దిశ మార్చుకుని ఈశాన్య బంగాళాఖాతం, ఒడిశా తీరాలవైపు మరలిపోతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 9 నుంచి.. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలతోపాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవీ చదవండి: