ETV Bharat / city

అందమైన అమ్మాయి నుంచి ఫ్రెండ్​ రిక్వెస్ట్​.. ఓకే చేశారా.. ఇక అంతే..! - ఫేస్​బుక్​లో మోసాలు

Facebook Love Cheating: రోజూలాగానే చరవాణిలో ఫేస్​బుక్​ ఓపెన్​ చేసిన ఆ యువకుడికి.. ఫ్రెండ్​​ రిక్వెస్ట్​ కనిపించింది. ఎవరా అని ప్రొఫైల్​ ఓపెన్​ చేసి చూసిన అతడి కళ్లు మతాబుల్లా వెలిగాయి. అరె ఎంత అందంగా ఉందీ అమ్మాయి అనుకుంటూ వివరాలేవీ చూడకుండా రిక్వెస్ట్​ ఆక్సెప్ట్​ చేశాడు. ఇక అప్పటినుంచి చాటింగ్​లు మొదలయ్యాయి. మెల్లగా ఫోన్లలో మాట్లాడుకోవడం షురూ అయింది. పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. మనోడికి అసలు సినిమా అప్పుడు మొదలైంది. శుభం కార్డు పడేలోపు.. జేబుకు కత్తెర పడింది. కళ్లు తెరుచుకునే లోపు.. అక్కడ ఖాతా మూతపడింది.

Facebook Love Cheating
అందమైన అమ్మాయి నుంచి ఫ్రెండ్​ రిక్వెస్ట్
author img

By

Published : May 12, 2022, 9:15 AM IST

Updated : May 12, 2022, 11:50 AM IST

Facebook Love Cheating: ఫేస్​బుక్​, వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​ ఖాతాలేవైనా కావొచ్చు.. మోసగాళ్ల టార్గెట్​ మాత్రం ఒక్కటే. అమాయకులు దొరికారా.. అందినాడికి దోచుకున్నామా.. ఆ తర్వాత ఖాతా క్లోజ్​ చేశామా.. ఫోన్​ స్విచాఫ్​ చేశామా.. ఇదీ ప్రస్తుతం నెట్టింట్లో సాగుతున్న సైబర్​ నేరాల దందా. ఇలాంటి నేరాలపై ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా.. ఎక్కడో చోట సైబర్​ క్రైమ్​ బాధితులు మాత్రం వెలుగులోకి వస్తూనే ఉన్నారు. మోసపోయామని కొందరు పోలీసులను ఆశ్రయిస్తే.. మరికొందరు బయటకు చెప్పుకోలేక లోలోపలే మధనపడుతున్నారు. తాజాగా ఫేస్​బుక్​లో అమ్మాయి పేరుతో ఓ యువకుడిని మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి రూ. 2 లక్షల నగదు, చరవాణిని సైబర్​ క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో నివాసం ఉంటున్న ఓ యువకుడికి ఫిబ్రవరి 2020లో ఫేస్​బుక్​లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇందుషా తుమ్మల అనే పేరుతో అందమైన ప్రొఫైల్​ పిక్​ కనిపించడంతో వెంటనే అంగీకరించాడు. తర్వాత కొన్ని నెలల పాటు ఫేస్​బుక్ చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత యువకుడి ఫోన్​ నెంబర్ తీసుకున్న ఇందుషా తుమ్మల.. క్రమంగా ఫోన్​లోనూ మాట్లాడేది. తక్కువ సమయంలోనే వారి పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. చూస్తుండగానే.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి కూడా వచ్చేశారు.

ఇక అప్పటి నుంచి ఇందుషా తన ప్లాన్​ అమలు చేసింది. పెళ్లి మైకంలో యువకుడిని ముంచేసిన ఇందుషా.. తన చదువుల కోసమని ఒకసారి... కరోనా బారిన పడ్డామని మరోసారి.. ఇలా విడతల వారీగా యువకుడి నుంచి రూ. 45 లక్షలు వసూలు చేసింది. ఇక చాల్లే అనుకుందో ఏమో..? ఆ తర్వాత ఫోన్ చేయడం మానేసింది. తన ఫియాన్సీ ఫోన్​ కోసం ఎదురుచూసిన ఆ యువకుడు.. తిరిగి ఎన్నిసార్లు ఫోన్​ చేసినా స్విచాఫ్ వచ్చింది​. పెళ్లి మత్తు నుంచి తేరుకున్న యువకుడు.. మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంకేతికత ఆధారంగా నిందితురాలి చిరునామా గుర్తించారు. తీరా అక్కడికెళ్లి చూస్తే అవాక్కవటం పోలీసుల వంతైంది. అక్కడ ఇందుషా ఉంటుందనుకుంటే.. ఆ స్థానంలో ఓ కుర్రాడిని చూశారు. ఇంకేముంది మోసం బట్టబయలైంది. అందమైన యువతి పేరుతో ఆ వ్యక్తి ఆడిన డ్రామా అంతా బయటపడింది. నిందితుడు ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన మోతె అశోక్​గా గుర్తించి అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీటెక్ మధ్యలోనే మానేసిన అశోక్ దుర్వ్యసనాలబారిన పడి మోసాలకు చేయడం ఎంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వాయిస్​ ఛేంజర్​ యాప్​.. ఇక్కడే మీకో అనుమానం రావొచ్చు. యువకుడు ఫోన్​లో మాట్లాడేటప్పుడు.. వాయిస్​ వినైనా అబ్బాయో అమ్మాయో తెలుసుకోవచ్చు కదా.. దానికి ఈ అశోక్​ సాంకేతికతను విచ్చలవిడిగా వినియోగించుకున్నాడు. యువకుడికి అనుమానం రాకుండా.. ఫోన్​లో మాట్లాడే క్రమంలో వాయిస్ ఛేంజర్ అప్లికేషన్ ఇన్​స్టాల్​ చేసుకున్నాడు. తను ఫోన్​లో మాట్లాడితే అవతలి వ్యక్తికి యువతి గొంతులా వినిపిస్తుంది. దీంతో స్వీట్​ వాయిస్​తో సదరు యువకుడి నుంచి.. రూ. 45 లక్షలు కొల్లగొట్టాడు.

అశోక్​ ఆ 45 లక్షల రూపాయల్లో 43 లక్షల రూపాయలను ఆన్​లైన్ గేమ్స్ ఆడి ఖర్చు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫేస్​బుక్​లో మహిళ పేరుతో యువకుడు మోసానికి పాల్పడిన వార్తను యూట్యూబ్​లో చూసిన అశోక్, తాను అదే మార్గాన్ని ఎంచుకున్నాడని దర్యాప్తులో తేలడం కొసమెరుపు.

ఇవీ చదవండి:

Last Updated : May 12, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.