ఈ స్మార్ట్ యుగంలో చాలా మంది తమ రోజువారీ వ్యక్తిగత, వృత్తిగత విషయాలను వాట్సాప్ (WHATSAPP) ద్వారా షేర్ చేసుకుంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న సేబర్ నేరస్థులు.. చోరీలు కొనసాగిస్తున్నారు. విదేశాల్లో ఉన్న కొందరి వాట్సాప్ నంబర్లు సేకరించి.... వారికి కొన్ని లింక్‌లు, మెసేజ్‌లు పంపి వాటిని హ్యాక్ చేస్తున్నారు. వారి కాంటాక్ట్స్‌ని నిశితంగా పరిశీలించాక... వారి పేరుతో వారి స్నేహితుల వద్ద నుంచే డబ్బులు తీసుకుంటారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఇలాంటి కేసే నమోదైంది.
నగరానికి చెందిన ఓ వ్యక్తి.. అమెరికాలో ఉన్న తన బావతో తరచూ చాటింగ్ చేస్తుంటాడు. అక్కడి వ్యక్తి వాట్సాప్‌ను హ్యాక్ చేసిన దుండగులు.. స్నేహితుడు ఆసుపత్రిలో ఉన్నాడని మాయమాటలు చెప్పి మూడున్నర లక్షలు బదిలీ చేయించుకున్నారు. తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి వ్యవహారాలు తరచుగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. ఏపీకే(APK) అనుసంధానమైన మెసేజ్‌లు, కోడ్‌లు వాట్సాప్‌కు పంపుతారని.. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: