ETV Bharat / city

cyber crime: ఇన్సూరెన్స్‌ పేరుతో.. తెలంగాణ ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డికి వల - tsspdcl

నానాటికి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరిని వదలడం లేదు. దొరికినంత దొచుకోవడానికి వేయని ఎత్తులు లేవు. జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని తెలంగాణ ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డికి వల వేయబోయారు కేటుగాళ్లు.

cyber cheaters are trying to cheat tsspdcl cmd raghuma reddy with insurance policy
తెలంగాణ ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి
author img

By

Published : Jul 17, 2021, 7:44 AM IST

సైబర్‌ కేటుగాళ్లు ఉన్నతాధికారులను కూడా వదలడం లేదు. తెలంగాణ ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ (TS SPDCL CMD) రఘుమారెడ్డికి ఆగంతుకులు ఫేక్‌ కాల్‌ చేశారు. తాము జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించారు. ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ కోసం డాక్యుమెంట్స్‌ కావాలని అడగడంతో ఆయన తన ఆధార్‌, పాన్‌ కార్డులను వారికి పంపించారు. ఆ తర్వాత అది ఫేక్‌ కాల్‌ అని గుర్తించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వర్క్ ఫ్రం హోం జాబ్ పేరుతో..

వర్క్ ఫ్రం హోం జాబ్ పేరుతో సైబర్ నేరగాళ్లు 1 .80 లక్షలను దండుకున్నారు. హైదరాబాద్ కవాడిగూడకు చెందిన శ్రీ మణికంఠకి ఇంటి వద్ద నుంచి పని చేసే ఉద్యోగం ఉందంటూ ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్​లో ఉన్న లింక్ క్లిక్ చేసి వారు అడిగిన డాక్యుమెంట్లు.. సెండ్ చేశాడు. జాబ్ కోసం పలు రకాల ఛార్జీల పేరుతో 1.80 లక్షలు ఆన్​లైన్​ ద్వారా కేటుగాళ్లు రాబట్టుకున్నారు. అనంతరం వారి ఫోన్ చేస్తే కలవకపోవడంతో.. మోసపోయానని గ్రహించి సీసీఎస్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఐఏఎస్​ అకాడమీపై దుష్ప్రచారం!

హైదరాబాద్ అశోక్​నగర్​కి చెందిన తక్షశిల ఐఏఎస్ అకాడమీపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అకాడమీ యాజమాన్యం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అకాడమీ నకిలీ అని.. ఇందులో చదువుకోవద్దని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చూడండి:

VIJAYAWADA ACP: విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు 4 వారాల జైలుశిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.