ETV Bharat / city

అమెజాన్​లో.. ర్యాక్స్ బదులు కండోమ్​ ప్యాకెట్లు, చీర, జాకెట్లు - amazon delivers onother products news

ఓ వ్యక్తి తన అవసర నిమిత్తం అమెజాన్​లో కొన్ని వస్తువులు బుక్​ చేసుకున్నాడు. తీరా అవి చేతికొచ్చాక చూస్తే.. కండోమ్​ ప్యాకెట్లు.. చీరా జాకెట్లు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సదరు కస్టమర్​ బుక్​ చేసింది వేరే వస్తువులు.

customer receive another product in amazon
అమెజాన్​లో.. ర్యాక్స్ బదులు కండోమ్​ పాకెట్లు, చీర, జాకెట్లు
author img

By

Published : Jan 12, 2021, 7:39 PM IST

అమెజాన్​లో.. ర్యాక్స్ బదులు కండోమ్​ పాకెట్లు, చీర, జాకెట్లు

ప్రముఖ ఆన్​లైన్​ సంస్థ అమెజాన్​లో బుక్ చేసిన వస్తువులకు బదులు వేరే వస్తువులు వచ్చిన సంఘటన.. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన సాయిరామ్ తన అవసర నిమిత్తం 10 రాక్స్, 1 షెటర్​ను అమెజాన్​లో బుక్ చేసుకున్నాడు.

డెలివరీ బాయ్ వస్తువులను తీసుకొని సాయిరాంకు అప్పజెప్పాడు. డెలివరీ బాయ్ ముందే సాయిరాం వాటిని విప్పి చూడగా.. ర్యాక్స్​కు బదులు కండోమ్ ప్యాకెట్లు, షెటర్​కు బదులుగా చీరా, జాకెట్లు వచ్చాయి. వాటిని చూసి కంగుతిన్న అతను.. మోసపోయానని గ్రహించి మీడియాను ఆశ్రయించాడు. ప్రజలు ఇప్పుడిప్పుడే ఆన్ లైన్ వైపు మొగ్గుచూపుతున్నారని, ఈ విధంగా ప్రజలను మోసం చేయొద్దని కోరాడు.

ఇదీ చూడండి: తల్లితో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.