ETV Bharat / city

రాష్ట్రమంతా ఒకేలా కర్ఫ్యూ

author img

By

Published : Jul 13, 2021, 5:50 AM IST

అన్ని జిల్లాల్లో ఒకే మాదిరిగా కర్ఫ్యూ అమలు చేసేలా సడలింపులు ఇస్తున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌, ఇతర అంశాలపై ఉపముఖ్యమంత్రి (వైద్యం) ఆళ్ల నానితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సోమవారం సీఎం సమీక్షించారు. దయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాలు తెరవవచ్చని, రాత్రి పది నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టంచేశారు.

curfew in ap
curfew in ap

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ ఒకే మాదిరిగా అమలు చేసేలా సడలింపులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాలు తెరవవచ్చని, రాత్రి పది నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టంచేశారు. కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌, ఇతర అంశాలపై ఉపముఖ్యమంత్రి (వైద్యం) ఆళ్ల నానితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సోమవారం సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5% లోపలే ఉందని, అయినా మాస్కు ధరించని వారి నుంచి రూ.100 జరిమానా విధించాలని అధికారులకు స్పష్టంచేశారు. దుకాణాల్లో పనిచేసే సిబ్బంది నుంచి వినియోగదారుల వరకూ అందరూ మాస్కులు ధరించాల్సిందేనన్నారు. దీన్ని ఉల్లంఘిస్తే ఆ దుకాణాలకు జరిమానా విధించడమే కాదు, అవసరమైతే రెండు, మూడు రోజులపాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానా విధించాలని, ఇందుకు ప్రత్యేకంగా వాట్సప్‌ నంబరు ఏర్పాటుచేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ను కఠినంగా అమలుచేయాలని పేర్కొన్నారు. ఫీవర్‌ సర్వే నిర్వహణలో జ్వరం, ఇతర లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేయించాలని, వారికి అవసరమైన మందులు అందజేయాలని ఆదేశించారు.

కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు

డిగ్రీ విద్యార్థులకు కళాశాలల్లోనే ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, టీకాలు వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘పాఠశాలలు తెరిచేనాటికి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి. నాడు-నేడులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రహరీలు నిర్మించాలి. కరోనా మూడో దశ ఉందని సంకేతాలు వస్తున్నందున చిన్నపిల్లల వైద్యుల నియామకాలు త్వరితగతిన పూర్తిచేయాలి. ఆసుపత్రుల్లో అవసరమైన మందులు సిద్ధంచేయాలి. వర్షాకాలం నేపథ్యంలో డెంగీ వంటి జ్వరాలు వచ్చే ఆస్కారం ఉన్నందున పీహెచ్‌సీలు, ఏజెన్సీ ప్రాంత వైద్యులను అప్రమత్తం చేయాలి. మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో పాముకాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున అవసరమైన ఇంజెక్షన్లను సిద్ధంగా ఉంచాలి’ అని సీఎం ఆదేశించారు.

గర్భిణులకు వ్యాక్సినేషన్‌ ప్రారంభించాం: అధికారులు

‘రాష్ట్రంలో ఇప్పటివరకు 1,31,43,873 మందికి టీకా వేశాం. వీరిలో 96,83,544 మంది తొలిడోసు పొందగా, మిగిలిన వారు రెండు డోసులూ వేసుకున్నారు. గర్భిణులకు టీకా పంపిణీ ప్రారంభించామ’ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ‘రాష్ట్రంలో 7 జిల్లాల్లో పాజిటివిటీ 3% కంటే తక్కువగా ఉంది. రికవరీ రేటు 97.83%గా ఉంది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో మొత్తమ్మీద 92.91% మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో 3,876 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు కాగా, 2,500 మంది చికిత్స పొందారు. 324 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఎంపికచేసిన ఆసుపత్రుల్లో నిర్మాణాల్లో ఉన్న 93 ఆక్సిజన్‌ ప్లాంట్లు ఆగస్టు నెలాఖరు నాటికి సిద్ధమవుతాయి. 50 పడకలు దాటిన ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంటు ఉండేలా జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చామ’ని అని తెలిపారు.

ఇదీ చదవండి: 'జీవో-2తో సర్పంచులు కీలు బొమ్మలే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.