ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం పనులను వచ్చే మార్చి 31లోగా పూర్తి చేయాలని సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. పథకం పనులపై సచివాలయం నుంచి సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.
పీఎంజీఎస్వై-1 లక్ష్యాలు
- కేంద్ర ప్రభుత్వం మైదాన ప్రాంతాల్లో 500పైగా జనాభా కలిగి రహదారి సౌకర్యం లేని ఆవాసాలు.
- గిరిజన ప్రాంతాల్లో 250పైగా జనాభా ఉండి రహదారి లేని ఆవాసాలు.
- నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 100 నుండి 249 జనాభా ఉండి రహదారి సౌకర్యం లేని ఆవాస ప్రాంతాలు.
- 2019 మార్చి 31లోగా ఈ ప్రాంతాల్లో రహదారి సౌకర్యం కల్పించటం.
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ ప్రోగ్రాంను 2016-17లో మంజూరు చేసిందని సీఎస్ చెప్పారు. ఈ పథకం కింద మంజూరైన పనులన్నీ 2020 మార్చి 31లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించిందని సీఎస్ స్పష్టం చేశారు. అయితే అటవీ శాఖ నుంచి అనుమతుల మంజూరులో జాప్యం, కాంట్రాక్టర్ల సమస్య తదితర కారణాల వల్ల మంజూరైన పనులు సకాలంలో పూర్తికాలేదని పేర్కొన్నారు. వీటన్నింటినీ వచ్చే మార్చి 31లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, పంచాయితీరాజ్, భవనాలు రహదారుల శాఖ, అటవీశాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు.
ఇదీ చదవండి: ఉగాది తర్వాత రచ్చబండ!