కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించే విధంగా బడ్జెట్‌లో అంశాలు లేవని చెప్పారు. ఇది ప్రజా, దేశ వ్యతిరేక బడ్జెట్‌గా రాఘవులు అభివర్ణించారు. కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరిగిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిన నేపథ్యంలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గాంధీ కృషి వెలకట్టలేనిది
భాజపా ఎంపీ అనంతకుమార్.. గాంధీపై చేసిన విమర్శలను రాఘవులు తప్పుపట్టారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. నిరసనకారులను కాల్చి చంపాలన్న భాజపా నేతల వ్యాఖ్యలనూ ఖండించారు. సీఏఏకి వ్యతిరేకంగా ఇంటింటి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్చి 16 నుంచి 23 వరకు కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
ఇవీచూడండి: పార్లమెంట్: లోక్‌సభలో 'హెగ్డే' దుమారం- కాంగ్రెస్ వాకౌట్