రాష్ట్రానికి మూడు రాజధానుల మాట ముఖ్యమంత్రి గొంతులో నుంచి పుట్టిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజధాని మార్పు విషయం ఏ మాత్రం ప్రస్తావించకుండా... ఇపుడు కమిటీలు, నివేదికలంటూ హడావుడి చేయటం... మూడు రాజధానులంటూ నిర్ణయించటంతో తీవ్ర గందరగోళం నెలకొందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కు పోయాయని... అభివృద్ధి అటకెక్కిందని విమర్శించారు. తాము వేసిన జీఎన్ రావు, బోస్టన్ కమిటీల నివేదికలపై కనీస చర్చ లేకుండానే ముఖ్యమంత్రి మూడు రాజధానులని ప్రకటించటం ముందస్తు పథకంలా అభివర్ణించారు.విశాఖ పరిపాలన రాజధాని అంటూ సీఎం ప్రకటించగానే... ఆ ప్రాంతాన్ని కబళించేందుకు భూ రాబందులు అక్కడ వాలాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అమరావతి అంశాన్ని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఆ ప్రాంతం...అరకు జిల్లాలో చేరనుందా..? ‘శ్రీకాకుళం నుంచి విడిపోనుందా..!