సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఇది కేవలం కక్షసాధింపు ధోరణిలా కనిపిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఫ్యాక్షన్ ధోరణితో ముందుకుపోతున్నట్లుందని విమర్శించారు. ఇలాగే వ్యవహారిస్తే.. అధికారుల్లో అభద్రతాభావం పెరుగిపోతుందని అన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు వైఖరిని మానుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: