ముఖ్యమంత్రి జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హాదా, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించటం అభినందనీయమన్నారు. 2014-15 లోటు బడ్జెట్ నిధులు కేంద్రం ఇప్పటికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించిందని తెలిపారు. విభజన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని గుర్తుచేశారు. రాష్ట్ర హక్కుల కోసం ఎంపీలు పోరాటం చేయాలని లేఖలో అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : 8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!