కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో చట్టాలపై సరైన చర్చ లేకుండానే బిల్లులను ఆమోదింపజేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇదే అంశంపై సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష పార్టీలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ( central minister kishan reddy ) చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల కోరిన అంశాలపై ఎందుకు చర్చ చేపట్టలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఒక్క హామీ కూడా అమలు చేయకుండానే.. అన్నీ చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పడం సరికాదన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీ(andhrapradesh)కి ఇచ్చిన హామీల సంగతేంటని నిలదీశారు. ఇదే అంశంపై రాష్ట్ర భాజపా నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాలని హితవు పలికారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై దిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి
CURFEW EXTEND: సెప్టెంబర్ 4వ తేదీ వరకు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు