రాష్ట్రంలో 2లక్షల 36 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ చెబుతుంటే..కేవలం 10వేల 143 ఉద్యోగాల భర్తీకే క్యాలెండర్ విడుదల చేయటం యువతను మోసం చేయడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI Ramakrishna) మండిపడ్డారు. రెండేళ్లలో 6లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. నెలకు రూ.5 వేల వేతనంతో సేవలందిస్తున్న వాలంటీర్లను ఉద్యోగస్తులుగా చూపడమేంటని విమర్శించారు.
ప్రభుత్వశాఖల్లో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని..రామకృష్ణ(CPI Ramakrishna) డిమాండ్ చేశారు. రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ మార్చి పూర్తిస్థాయిలో ఉద్యోగాల భర్తీకి క్యాలెండరు విడుదల చేయాలన్నారు. లేకుంటే విద్యార్థి యువజన సంఘాలతో ఆందోళన చేపడతామని రామకృష్ణ హెచ్చరించారు.
ఇదీ చదవండి:
CHANDRABABU: సంక్షేమం పేరుతో సీఎం జగన్ ప్రజల్ని మోసం చేశారు: చంద్రబాబు