ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కియా కార్ల పరిశ్రమ తరలింపు కథనాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ పరిశ్రమపై ఇప్పటికే రూ.13,500 కోట్లు పెట్టుబడి పెట్టారని లేఖలో వివరించారు. వేలమంది ఉపాధి పొందుతున్నారని... 30 వేల కార్లు ఉత్పత్తయ్యాయని తెలిపారు. కియా పరిశ్రమ తరలిపోతుందనే కథనాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి : 'సెలక్ట్ కమిటీ' విషయంలో మండలి కార్యదర్శిపై ఛైర్మన్ షరీఫ్ ఆగ్రహం