ETV Bharat / city

రాజధానిగా అమరావతే ఉండాలి:డి.రాజా - అమరావతికి సీపీఐ మద్దతు వార్తలు

మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి ఉండాలన్నదే సీపీఐ నిశ్చితాభిప్రాయమని వ్యాఖ్యానించారు.

మూడు రాజధానులకు సీపీఐ వ్యతిరేకం: రాజా
cpi-national-secretary-d-raja-comments-on-amaravthi
author img

By

Published : Feb 21, 2020, 12:28 PM IST

Updated : Feb 21, 2020, 1:05 PM IST

మూడు రాజధానులకు సీపీఐ వ్యతిరేకం: రాజా

మూడు రాజధానులకు సీపీఐ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాజా స్పష్టం చేశారు. దిల్లీలో ఆయన్ను అమరావతి పరిక్షణ సమితి నేతలు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాజధానిగా అమరావతే ఉండాలన్నది సీపీఐ నిశ్చితాభిప్రాయమని తెలిపారు. ఆందోళనను అణచివేసేందుకు ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని విమర్శించారు. నిరసనకారులు, మహిళలపై దాడులను ఖండించారు. రాజధానిపై ఆందోళనతో చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు.

వికేంద్రీకరణ అంటే మూడు రాజధానుల నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద రాష్ట్రాల్లోనూ ఈ తరహా నిర్ణయాలు లేవని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలు ఇక్కడెందుకని ఆక్షేపించారు. పునర్విభజన చట్టాన్ని కేంద్రం ఎందుకు అమలు చేయటంలేదనే విషయాన్ని ప్రభుత్వం నిలదీయాలని సూచించారు. ప్రజలతో పోరాడడం కంటే కేంద్రంతో పోరాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని హితవు పలికారు.

ఇదీ చదవండి :

'ప్రాణాలకు ముప్పు ఉంది.. భద్రత పునరుద్ధరించండి'

Last Updated : Feb 21, 2020, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.