అమరావతి ఉద్యమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన.... అమరావతి దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. భూములు ఇచ్చిన రైతులను స్వార్థపరులు అనడం సరికాదన్నారు. అమరావతిలో ఖర్చు చేసిన రూ.వేల కోట్ల ప్రజాధనం వైకాపా ప్రభుత్వం వృథా చేస్తోందని నారాయణ విమర్శించారు. గాంధీ జయంతి రోజు దిల్లీ వెళ్లి రైతులకు సంఘీభావం తెలుపుతామని చెప్పారు.
వైకాపా ప్రభుత్వం 3 రాజధానులను ఏర్పాటు చేయలనుకుంటే... అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ గెలవాలని... నారాయణ డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ప్రస్తావించని విషయాన్ని.. రాజకీయ లబ్ధికోసం అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
ఇవీ చదవండి: