ETV Bharat / city

రాజకీయ విజ్ఞత ఉంటే సీఎం, గవర్నర్​ రాజీనామా చేయాలి: సీపీఐ - గుంటూరులో సీపీఐ నారాయణ ధర్నా

మూడు రాజధానులకు మద్దతుగా ముఖ్యమంత్రి జగన్ తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాతీర్పు కోరాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సవాల్ విసిరారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించటాన్ని నిరసిస్తూ గుంటూరు అంబేడ్కర్ కూడలిలో సీపీఐ చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు.

cpi narayana
cpi narayana
author img

By

Published : Aug 4, 2020, 4:01 PM IST

మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. ప్రజలు జగన్​ను మళ్లీ గెలిపిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరించిన జగన్.. మోసకారి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. అసలు ఈ విషయంలో గవర్నర్ ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు.

ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో గవర్నర్ వైఖరి సరిగా లేదని.. రాజకీయ విజ్ఞత ఉంటే గవర్నర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో భాజపా దాగుడుమూతలు ఆడుతోందన్నారు. ప్రధాని మోదీ వేసిన పునాదిరాయికి విలువ లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. అమరావతికి కన్నా లక్ష్మీనారాయణ అనుకూలం కాబట్టే ఆయనను తొలగించారని ఆరోపించారు. జగన్, భాజపా, గవర్నర్ అంతా కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: 160 కోట్ల మంది విద్యార్థులపై కరోనా ప్రభావం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.