విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది చనిపోయి.. వందల మంది క్షతగాత్రులైతే ముఖ్యమంత్రి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంత్రులకు శిక్ష వేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే మంత్రులకు బదులు.. పరిశ్రమ ఛైర్మన్, ఎండీ భార్యబిడ్డలతో అక్కడ కాపురం పెట్టించాలన్నారు. అప్పుడే ప్రజలు పడుతున్న బాధలు అర్థమవుతాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. లాక్‌డౌన్ సమయంలో అసలు కంపెనీని తెరవడమే సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకూ వర్క్ ఫ్రం హోమ్!