ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించడం అసాధ్యం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని నారాయణ అన్నారు.. బిహార్లో అసెంబ్లీ, హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రతినిధులతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్చించి.. మంచి వాతావరణంలో ఎన్నికల నిర్వహణ చేపట్టాలని కోరారు.
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్కు సహకరించడం ప్రభుత్వ బాధ్యత అని నారాయణ అన్నారు. సామరస్యంగా ఇరు వర్గాలు సమస్యను పరిష్కరించుకుని.. ఎన్నికలు జరిగేలా చూసి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని నారాయణ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'చిన్న బాధ ఉంది'... సీఎం జగన్ భావోద్వేగం