గర్భిణుల(Covid Vaccine to pregnant women)కు కొవిడ్-19 టీకా సురక్షితమేనని మరోసారి రుజువైంది. టీకాతో తొలి మూడు నెలల్లో గర్భస్రావమయ్యే ముప్పేమీ పెరగటం లేదని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. టీకా తీసుకున్నవారిలో తొలి మూడు నెలల్లో గర్భస్రావమైనవారి, ఇంకా గర్భం నిలిచి ఉన్నవారి నిష్పత్తిని పరిశోధకులు పోల్చి చూసి ఈ విషయాన్ని తేల్చారు.
కొవిడ్-19 టీకా తీసుకున్నాక తొలి నెలల్లో గర్భస్రావ ముప్పు(Abortion) పెరుగుతుందనటానికి ఎలాంటి రుజువులూ లభించలేదని యూనివర్సిటీ ఆఫ్ ఒటావా పరిశోధకులు డాక్టర్ దేషాయ్నే ఫెల్ పేర్కొంటున్నారు. గర్భధారణ సమయంలో టీకా సురక్షితమేననే విషయాన్ని ఇది బలపరుస్తోందని వివరిస్తున్నారు. మనదేశంలోనూ గర్భిణుల(Covid Vaccine to pregnant women)కు కొవిడ్-19 టీకాను అనుమతించిన విషయం తెలిసిందే. అయితే పిండం మీద దుష్ప్రభావాలు చూపొచ్చన్న భయంతో కొందరు దీన్ని తీసుకోవటానికి వెనకాడుతున్నారు. ఇలాంటి సందేహాలేవీ అవసరం లేదని తాజా అధ్యయనం నొక్కి చెప్పినట్టయ్యింది.
ఇదీ చదవండి:
కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం..ప్రభుత్వ ఉత్తర్వులు