ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైనన్ని కొవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీకి మరో 1,57,210 డోస్‌ల వ్యాక్సిన్ కేటాయించామని, ఏప్రిల్ రెండో తేదీ నాటికి అవి రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తగిన పరిమాణంలో వ్యాక్సిన్ సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఈ నెల 26న లేఖ రాశారు. దానికి ఆ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ బదులిచ్చారు. వ్యాక్సిన్ ప్రక్రియకు అవరోధం కలిగే పరిస్థితి తలెత్తనీయమని స్పష్టంచేశారు.
ఇదీ చదవండి: ఏప్రిల్ 1న కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్