శ్రామిక్ రైళ్ల ద్వారా రాష్ట్రంలోని వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేరవేసే ప్రక్రియ కొనసాగుతోందని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారి కృష్ణబాబు తెలిపారు. ఇవాళ రాష్ట్రం నుంచి 5 శ్రామిక్ రైళ్ల ద్వారా బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాకు చెందిన కార్మికులను స్వస్థలాలకు పంపనున్నట్లు వెల్లడించారు. రాబోయే వారం రోజుల పాటు రోజుకు ఐదు శ్రామిక్ రైళ్లు నడిపి... పెద్ద సంఖ్యలో వలస కార్మికులను తరలించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. దీనికయ్యే పూర్తి ఖర్చును రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ నుంచి వచ్చేవారిపై నిర్ణయం తీసుకోలేదు. వ్యక్తిగతంగా రాష్ట్రానికి వచ్చేవారిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్ నుంచి వచ్చేందుకు స్పందనలో కొందరు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులపై ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. సీఎం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు- కృష్ణబాబు, కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారి
ఇదీ చదవండి :