స్వస్థలాలకు నడిచివెళ్లే కూలీల తరలింపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు అందాయని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారి కృష్ణబాబు తెలిపారు. వలస కూలీల కోసం ఇతర రాష్ట్రాలకు 75 రైళ్లను నడిపినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ మొత్తం 87 వేల మంది వలస కూలీలను స్వస్థలాలకు పంపినట్లు వివరించారు. జూన్ 1 తర్వాత కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేందుకు తెలంగాణ నుంచి ఎటువంటి అనుమతి లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే బస్సులు నడుపుతామని వెల్లడించారు. రాష్ట్రంలో 25 శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. బస్సుల్లో ప్రయాణానికి ప్రజల నుంచి అంతగా స్పందన లేదని కృష్ణబాబు పేర్కొన్నారు. జూన్ 1 తర్వాత 28 రైళ్లు రాష్ట్రం మీదుగా వస్తున్నట్లు తెలిపారు.