రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 70,727 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,843 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు 12 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. తాజాగా కొవిడ్ నుంచి మరో 2,199 మంది బాధితులు కోలుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,571 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ ప్రభావంతో.. ప్రకాశం జిల్లాలో 3, నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,39,09,363 మంది నమూనాలు పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండీ.. గనులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో ఆంతర్యమేంటి..?: కాలవ